గంజాయి రవాణాకు | - | Sakshi
Sakshi News home page

గంజాయి రవాణాకు

Aug 6 2025 6:36 AM | Updated on Aug 6 2025 6:36 AM

గంజాయ

గంజాయి రవాణాకు

బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025

ఖమ్మం కలెక్టర్‌ను

కలిసిన ఐటీడీఏ పీఓ

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ ఖమ్మం కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సంక్షేమానికి సంబంధించిన అధికారిక సమావేశాలు ఖమ్మం కలెక్టరేట్‌లో జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లిన రాహుల్‌.. కలెక్టర్‌ను కలిశారు. గిరిజన గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై చర్చించారు.

రేపు జాబ్‌మేళా

సింగరేణి(కొత్తగూడెం): చుంచుపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఈనెల 7వ తేదీన నిరుద్యోగులకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లో కొత్తగూడెం, పాల్వంచ, జూలూరుపాడు, మణుగూరు, భద్రాచలం, ఖమ్మం జిల్లా సత్తుపల్లి, తల్లాడల్లో సెంటర్‌ మేనేజర్‌/ఈఆర్‌ఓ/ఎల్‌ఆర్‌ఓ రూరల్‌/మైక్రోలోన్స్‌ పోస్టుల్లో పని చేయాల్సి ఉంటుందని వివరించారు. 18 – 32 సంవత్సరాల వయసు కలిగి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు.

బ్యాండెడ్‌ క్రైట్‌ కలకలం

పాముల్లో అత్యంత విషపూరితమైనదిగా పేరు

మణుగూరు టౌన్‌: మణుగూరులో బ్యాండెడ్‌ క్రైట్‌ పాము కలకలం సృష్టించింది. సింగరేణి అధికారులు నివాసముండే ప్రాంతంతో ఈ పాము సోమవారం అర్ధరాత్రి కనిపించగా స్నేక్‌ క్యాచర్‌ సాయంతో బంధించి అడవిలో వదిలేశారు. మణుగూరు సింగరేణి ఏరియాలోని ఓ అధికారి నివాసంలో పాము తిరగడాన్ని ఆయన కుటుంబీకులు గుర్తించారు. దీంతో స్నేక్‌ క్యాచర్‌ మహ్మద్‌ ముజాఫర్‌కు సమాచారం ఇవ్వగా ఆయన చేరకుని దాదాపు మూడున్నర గంటల పాటు శ్రమించి పామును పట్టుకున్నారు. అయితే, ఈ పామును పరిశీలించగా బ్యాండెడ్‌ క్రైట్‌గా తేలింది. పాముల్లో అత్యంత విషపూరితమైనదిగా భావించే ఇది కాటు వేస్తే మరణం అంచుల్లోకి చేరతారని, చికిత్స కాస్త ఆలస్యమైనా పక్షవాతం లేదా అవయవాలన్నీ చచ్చుపడిపోతాయని చెబుతున్నారు. రాత్రిపూట మాత్రమే సంచరించే ఈ రకం పాము ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో అధికంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు పామును బంధించి అటవీ ప్రాంతంలో వదిలేయడంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఫొటోతో సహా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

అక్రమార్కుల ఆటలు కట్టించేందుకు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత నిఘా వ్యవస్థ జిల్లాలో అందుబాటులోకి వచ్చింది. భద్రాచలం వద్ద గోదావరి వంతెన సమీపంలో ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థ ఏర్పాటైంది. గంజాయి, ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ఆధునిక వ్యవస్థ.. ఏ మేరకు పని చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి..

భద్రాచలం మీదుగా ఇతర ప్రాంతాలకు సరఫరా

భద్రాద్రి వంతెన వద్ద అందుబాటులోకి ఆధునిక నిఘా

ఆర్టిిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో అక్రమార్కుల గుర్తింపు

గోదావరి వంతెన వద్ద ఏర్పాటవుతున్న చెక్‌ పోస్టు (ఇన్‌సెట్‌) కొత్తగా అమర్చిన సీసీ కెమెరాలు

వారధిగా భద్రాద్రి

ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలతో జిల్లా సరిహద్దులు పంచుకుంటోంది. అంతేకాక.. ఒడిశాకు అతి సమీపంలో ఉంది. దీంతో ఈ మూడు రాష్ట్రాల నుంచి వాహనాలు జిల్లా మీదుగా తెలంగాణలోకి రాకపోకలు సాగిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణాలోకి వచ్చేందుకు అశ్వారావుపేట దగ్గర ఓ హైవే ఉండగా, భద్రాచలం వద్ద మరో జాతీయ రహదారి ఉంది. ఇందులో భద్రాచలం మీదుగా వెళ్లే ఎన్‌హెచ్‌ – 30 రహదారి గంజాయి అక్రమ రవాణాకు కీలకంగా మారింది. ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ఉన్న ఎత్తయిన కొండలు, దట్టమైన అడవుల్లో పండించిన గంజాయిని జిల్లా మీదుగా హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు తరలించడం పరిపాటిగా మారింది. దీంతో కేవలం గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకే భద్రాచలంలో గోదావరి వంతెన ప్రారంభంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి 24 గంటలూ నిర్విరామంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

నిఘా పెరిగింది

జిల్లాలో గోదావరి తీరంలో ఇసుక ర్యాంపులు ఉన్నాయి. ఇక్కడి రీచ్‌ల నుంచి వెళ్లే ఇసుక మార్గమధ్యలో పక్కదారి పడుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఇసుక అమ్మకాల్లో పారదర్శకత తెచ్చేందుకు తెలంగాణ మినరల్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నిఘాను పెంచింది. రీచ్‌ల దగ్గరనే కాకుండా రాష్ట్ర రాజధానికి ఇసుక వెళ్లే మార్గంలో ముఖ్యమైన కూడళ్ల వద్ద కూడా నిఘా పెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భద్రాచలం చెక్‌పోస్టు దగ్గర ఇటీవల టీజీఎండీసీ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఆటోమేటెడ్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ సాంకేతికతను ఉపయోగిస్తోంది. వచ్చి పోయే వాహనా ల వీడియోలను సీసీ కెమెరాల్లో రికార్డు చేయడంతో పాటు నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా.. తీసుకున్న పర్మిట్‌ ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతోంది. సరైన మార్గంలోనే వెళ్తుందా, పక్కదారి పడుతోందా అనే విషయాలు తెలుసుకునే వీలుంది.

ఫలితాలపై ఆసక్తి..

మూడు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి గేట్‌వేగా ఉన్న భద్రాచలం పట్టణం మీదుగా గంజాయి, ఇసుకల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. దీన్ని అరికట్టేందుకు ఏడాది కాలంగా సాధారణ నిఘాను పోలీసులు, అబ్కారీ, టీజీఎండీసీలు పెంచాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఆటోమేటెడ్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌తో పాటు ఆరిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను కూడా ఉపయోగించాలని నిర్ణయించారు. గంజాయి, ఇసుక అక్రమ రవాణాకు ఈ ఆధునిక నిఘాతోనైనా అడ్డుకట్ట పడుతుందనే ఆశాభావం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అంతటా వినిపిస్తున్న ఏఐ టెక్నాలజీ నిఘా ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకునేందుకు ప్రభుత్వ అధికారులు ఆసక్తి చూపిస్తున్నారు.

మిర్చి ధరలో పురోగతి

ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధర కొంత మేర పెరిగింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం క్వింటాకు రూ.14,350 ధర పలికింది. పంట సీజన్‌ ఫిబ్రవరిలో గరిష్టంగా రూ.14,200 పలకగా, ఏప్రిల్‌ మూడో వారం వరకు రూ.13,500, ఆపై రూ.12,200కు పడిపోయింది. జూన్‌లో అదే పరిస్థితి ఉండగా జూలై నుంచి పెరుగుతూ ఇప్పుడు రూ.14,350కు చేరింది. ఈ ధర కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చికి పలకగా, నాన్‌ ఏసీ మిర్చి ధర గరిష్టంగా రూ.8,800గానే ఉండడం గమనార్హం.

హెచ్‌పీఎస్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు

ఖమ్మంమయూరిసెంటర్‌: హైదరాబాద్‌ బేగంపేట, రామంతపూర్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూళ్లలో ఒకటో తరగతిలో ప్రవేశానికి ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరానికి ఖమ్మం జిల్లాకు రెండు సీట్లు కేటాయించగా, ఈనెల 8వ తేదీ లోపు తమ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని సూచించారు. జనన, కుల, ఆదాయ, స్థానికత ధ్రువపత్రాలతో పాటు రేషన్‌, ఆధార్‌ కార్డుల జిరాక్స్‌ కాపీలను గెజిటెడ్‌ అధికారి అటెస్టేషన్‌తో దరఖాస్తుకు జతచేయాలని తెలిపారు.

ఇదేం న్యాయం..?

సింగరేణి ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో కార్మికులు, ఉద్యోగుల పిల్లలకు న్యాయమైన వాటా దక్కడం లేదనే విమర్శలు ఉన్నాయి.

10లో

న్యూస్‌రీల్‌

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ చేరిక..

భద్రాచలంలో గోదావరి నది వద్ద తాజాగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు దగ్గర సీసీ కెమెరా ఫుటేజీలు, వీడియోల లైవ్‌ రికార్డింగ్‌లకు సరికొత్త ఆర్టిిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వ్యవస్థ కూడా తోడైంది. హైదరాబాద్‌కు చెందిన బ్లూ క్లౌడ్‌ సాఫ్ట్‌టెక్‌ సొల్యూషన్స్‌ సంస్థ అందించే సాంకేతిక సహకారంతో భద్రాచలం గోదావరి వంతెన దగ్గర నిఘా మరింత పటిష్టం కానుంది. లైసెన్స్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ (నంబర్‌ ప్లేట్‌ ఆధారిత సమాచారం), రూల్‌బేస్డ్‌ ఆల్టెరింగ్‌ (నిబంధనలకు అనుగుణంగా వాహనం ఉందా? ఏమైనా మార్పులు చేశారా ? ఉదా: పుష్ప తరహాలో పైన ట్రాక్టర్‌ బాడీ కింద గంజాయి తరలించే ఘటనలు జిల్లాలో కూడా జరిగాయి), బిహేవియరల్‌ అనామలీ (సందేహాస్పదంగా డ్రైవర్‌ ప్రవర్తన) తదితర ప్రాథమిక సమాచారాన్ని ఏఐ సాయంతో విశ్లేషించి గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెడుతుంది. ఏదైనా వాహనం సందేహాస్పదంగా కనిపిస్తే వెంటనే ఎస్సెమ్మెస్‌, వాయిస్‌ కాల్‌ రూపంలో సంబంధిత విభాగాల పోలీసులకు వాహనం వివరాలతో కూడిన అలెర్ట్‌ను పంపుతుంది. రాష్ట్ర మాదక ద్రవ్యాల నియంత్రన సంస్థ (తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో) సహకారంతో ఈ వ్యవస్థను భద్రాచలం దగ్గర ఏర్పాటు చేశారు.

గంజాయి రవాణాకు1
1/3

గంజాయి రవాణాకు

గంజాయి రవాణాకు2
2/3

గంజాయి రవాణాకు

గంజాయి రవాణాకు3
3/3

గంజాయి రవాణాకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement