
శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. మంగళవారం యాగశాలలో, ఆలయంలో అగ్నిప్రతిష్ఠ, అష్టోత్తర శత కలశావాహనం, పవిత్రాధివాసం, హవనం నిర్వహించారు. ఈనెల 9 వరకు జరిగే ఈ పవిత్రోత్సవాల్లో బుధవారం స్నపన తిరుమంజనం, పవిత్రారోపణం, హోమం జరపనున్నారు. 9న ఉత్సవ సమాప్తి, హయగ్రీవ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు అర్చకులు వెల్లడించారు. కాగా పవిత్రోత్సవాల సందర్భంగా 9వ తేదీ వరకు నిత్యకల్యాణాలు నిలిపివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
8న వరలక్ష్మీ వ్రతం, 22న పుష్పాంజలి..
శ్రావణ మాసోత్సవం సందర్భంగా ఈనెల 8వ తేదీన వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తామని, ఆ రోజున రామాలయంలో ప్రత్యేక పూజలు ఉంటాయని ఈఓ రమాదేవి తెలిపారు. సాయంత్రం 4 గంటలకు బేడా మండపంలో సామూహిక కుంకుమార్చన చేపడతామని చెప్పారు. అలాగే 22వ తేదీన సాయంత్రం 4గంటల నుంచి పుష్పాంజలి వేడుక ఉంటుందని, శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారికి వివిధ పుష్పాలతో అర్చన, విశేష భోగ నివేదన, మంత్ర పుష్పం తదితర పూజలు జరుగుతాయని వివరించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.
వైభవంగా అగ్నిప్రతిష్ఠ

శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు