పెద్దమ్మతల్లి ఆలయ ఉద్యోగి మృతి
పాల్వంచరూరల్: లారీ బైక్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో పెద్దమ్మతల్లి ఆలయం ఉద్యోగి మృతి చెందాడు. పోలీసుల కథనం.. కేశవాపురం గ్రామానికి చెందిన పెద్దమ్మతల్లి ఆలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కుంచాల సూర్యనారాయణ (48) శుక్రవారం విధులు ముగించుకుని పాల్వంచకు వెళ్తున్నాడు. ఇందిరానగర్ కాలనీ వద్ద బీసీఎం రహదారిపై పాల్వంచ వస్తున్న లారీ.. వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. అక్కడికక్కడే మృతి చెందాడు. 108 ద్వారా ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ లారీని వదిలేసి పారిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ టైర్ పేలి వ్యక్తికి
తీవ్ర గాయాలు
కరకగూడెం: మండల కేంద్రానికి చెందిన టప్ప సతీష్ టైర్ పంక్చర్ దుకాణం నడుపుతూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఓ ట్రాక్టర్ ట్రక్కు టైర్‌కు పంక్చర్ వేసి, గాలి నింపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు టైర్ పేలిపోయింది. ఈ క్రమంలో డిస్క్ సతీష్ తలకు, కుడి చేతికి బలంగా తాకింది. కుడి చేయి విరిగి, తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు సతీష్‌ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం 108లో మణుగూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
132 కేజీల గంజాయి పట్టివేత
అశ్వాపురం: గొల్లగూడెం వద్ద అశ్వాపురం పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. వివరాలు.. ఎస్సై మధుప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా గొల్లగూడెం సీ తారామ కెనాల్ వంతెన వద్ద కారులో వెనుక సీట్‌లో అక్రమంగా తరలిస్తున్న 132కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని చింతూరు నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు తరలిస్తున్న సిద్ధిపేటకు జిల్లాకు చెందిన పల్లెపు పరుశురాములును పోలీసులు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.
పెద్దమ్మతల్లి ఆలయ ఉద్యోగి మృతి
పెద్దమ్మతల్లి ఆలయ ఉద్యోగి మృతి


