టీడీపీ నేతలకు క్రోసూరు ఎస్ఐ రవిబాబు గులాంగిరీ
ఎస్ఐ ముసుగులో ఉన్న ‘దేశం’ కార్యకర్త పంచాయతీ ఎన్నికల వేళ మహిళలపై లాఠీచార్జి వైఎస్సార్ సీపీ మహిళా కార్యకర్తను కాలితో తన్నిన వైనం ఎంపీటీసీ నామినేషన్ల సమయంలో సైతం దళిత నాయకుడిపై కాళ్లతో దాడి వైఎస్సార్ సీపీ కార్యకర్తలే టార్గెట్గా పనిచేస్తున్న క్రోసూరు ఎస్ఐ రవిబాబు
టాస్క్ఫోర్స్: ఆయన ఎస్ఐ ముసుగులో ఉన్న తెలుగుదేశం కార్యకర్త.. పచ్చ ఖాకీకి నిలువెత్తు నిదర్శనం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే టార్గెట్గా విధులు.. స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి గులాం ఈ రవి. పల్నాడు జిల్లా క్రోసూరు ఎస్ఐ పి.రవిబాబు ఖాకీ ముసుగులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ టీడీపీ నేతల మెప్పు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడులు, అక్రమ అరెస్టులు చేశారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో క్రోసూరు మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలు ఉంటే వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఎక్కడా నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నాడు.
పచ్చ ఎస్ఐ దాష్టీకాలకు ఉదాహరణలు..
నామినేషన్ దాఖలు చేసేందుకు వెళుతున్న మాజీ జెడ్పీటీసీ భర్త చిలక పెదబాబుపై దుర్భాషలాడుతూ కాలితో తన్నాడు. వైఎస్సార్ సీపీ మద్దతుదారులు ఉన్న గ్రామాల్లో నామినేషన్ దాఖలు చేస్తే అంతు చూస్తామంటూ బెదిరించాడు. పంచాయతీ ఎన్నికల నామినేషన్లో కూడా రవిబాబు తన ప్రతాపాన్ని చూపాడు.


