బాపట్ల: జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఈనెల 20వ తేదీన స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. కార్యాలయంలో ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. కొత్తగా ఎన్నికై న జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు బాపట్లలో జరుగుతుందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రజా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికను కోరం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. జెడ్పీటీసీ సభ్యుల సంఖ్య 20 ఉండగా, నిబంధన ప్రకారం కోరం 10 మంది సభ్యులు ఉండాలన్నారు. సభ్యులు చేతులు పైకెత్తి ఓటు వేయడం ద్వారా ఎన్నిక జరుగుతుందన్నారు. ఎన్నిక పూర్తయిన వెంటనే నామినేట్ చేయబడిన వ్యక్తుల పేర్లను ప్రకటించాలన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయించి, ధ్రువీకరణ పత్రం జారీ చేయాలన్నారు. తదుపరి నూతనంగా ఎన్నికై న సంస్థ పదవీకాలం ప్రారంభమైనట్లు ప్రకటిస్తారన్నారు. ఏదైనా కారణంచేత ఎన్నిక జరగకపోతే మరుసటి రోజైన ఈనెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు మళ్లీ ఎన్నికల ప్రక్రియ జరుగుతుందన్నారు.


