స్థానికేతరులను ఓడించడమే ప్రధాన అజెండా | - | Sakshi
Sakshi News home page

స్థానికేతరులను ఓడించడమే ప్రధాన అజెండా

Nov 19 2026 2:43 AM | Updated on Nov 19 2026 2:43 AM

● ఎమ్మెల్యే అవినీతిపై పోరాడుతా ● మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌

బాపట్ల: బాపట్ల మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి కూటమి ప్రభుత్వం పోటీలో ఉంచిన స్థానికేతరుడు ఇస్కా సునీల్‌ను ఓడించటమే ప్రధాన అజెండాగా ముందుకుపోతానని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్‌ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కాపు కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడు సంవత్సరాలపాటు తాను బీజేపీలో ఉన్నప్పటికీ ఏ పదవి ఆశించలేదని, స్థానికేతరుడికి స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వటంతో తాను పార్టీ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు చేస్తున్న అవినీతిపై పోరాటం చేస్తానని చెప్పారు.

అన్నం ఫ్యాక్టరీలో దాడులు

కర్లపాలెం మండలం దుండివారిపాలెంలోని అన్నం సతీష్‌ ప్రభాకర్‌ ఆక్వా ఫ్యాక్టరీపై బుధవారం రాత్రి అధికారులు దాడులు నిర్వహించారు. కొన్ని రికార్డులు పరిశీలించారు. అన్నం బీజేపీకి రాజీనామా చేసిన వెంటనే ఆయన ఫ్యాక్టరీలపై దాడులు చేయటం చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement