జిల్లాలో ప్రాణ నష్టం జరగరాదు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ప్రాణ నష్టం జరగరాదు

Nov 4 2026 2:02 AM | Updated on Nov 4 2026 2:02 AM

● జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ● లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి ● పునరావాస కేంద్రాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి

బాపట్ల మురసు తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో ఎక్కడా ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని న్యూ వీసీ హాలులో మురసు తుఫాన్‌ ప్రభావంపై తీసుకుంటున్న చర్యలపై అన్ని శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెనన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్చూరు, నల్లమడ, రొంపేరు వాగులు నీటి ప్రవాహం గురించి ప్రతి గంటకు సమాచార అందజేయాలన్నారు. వాగుల వద్ద ఇసుక బస్తాలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉండాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. వాగుల సమీపంలోని గ్రామాల ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని, వారికి భోజనంతోపాటుగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మార్టూరు, పర్చూరు, ఇంకొల్లు, కారంచేడు, యద్దనపూడి, చినగంజాం మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మెటీరియల్‌ పంపిణీ నిలిపివేయాలని సంబంధిత ఆర్‌ఓలకు సూచించారు. ఆరు మండలాలకు 12 ఆర్టీసీ బస్సులు పంపించాలని ఆర్‌ఎంను ఆదేశించారు. మండలాల పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇవ్వడం జరిగిందని తెలిపారు. పై మండలాలకు సంబంధించి తాగునీరు, బిస్కెట్లు, అరటి పండ్లు, పునరావాస కేంద్రాలకు సరఫరా చేయాలని డీఎస్‌ఓను ఆదేశించారు. రోడ్లు, విద్యుత్‌, వ్యవసాయ పంటలు, గృహాలు, డామేజ్‌ గురించి నివేదికలను అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్‌ఓ లవన్న, జెడ్పీ సీఈఓ సీహెచ్‌.విజయలక్ష్మి, సీపీఓ ఏ.ఎస్‌.రాజు, డీఆర్డీఏ, డ్వామా పీడీలు బి.సింగయ్య, విజయలక్ష్మి, డీఈఓ శ్రీనివాస్‌ సింగ్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement