మొదలైన ‘అర్నాబ్’ ప్రభావం
అల్లకల్లోలంగా బంగాళాఖాతం
తీరానికి చేరుకున్న మత్స్యకారుల పడవలు
గాలులకు బాపట్ల చీలు రోడ్డులో కూలిపోయిన రేకుల షెడ్డు
బాపట్ల: అర్నాబ్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. తుఫానన్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 27, 28 తేదీల్లో బీచ్‌లలో పర్యాటకుల సంచారంపై నిషేధం విధిస్తూ జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ చర్యలు చేపట్టారు. ప్రజలు, పర్యాటకులు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. 60 నుంచి 11 0మీల్లీమీటర్లు వర్షపాతం నమోదు కావచ్చని అంచనాకు వచ్చారు. సోమవారం రాత్రి నుంచే ఈదురుగాలులు మొదలయ్యాయి. చీలురోడ్డులో వినాయకుని మండపం కోసం వేసి రేకులషెడ్డు గాలులకు పడిపోయింది.


