బాపట్ల: భారత సమాజాన్ని సన్మార్గంలోకి తీసుకువెళ్లిన మహర్షి వాల్మీకి ఆదర్శప్రాయులని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. వాల్మీకి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. సంస్కృతంలో 24 వేల పద్యాలతో రామాయణాన్ని రాసిన మహనీయులు వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని వివరించారు. విద్య లేని నాటి కాలంలో సంస్కృత భాషలో చక్కని కావ్యాలను ప్రజలకు అందించారన్నారు. ఎదుటివారికి హాని కలిగించకుండా మంచి చేయాలన్న దృక్పథం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి లవన్న చెప్పారు. జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ బి.సింగయ్య, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, డీఈఓ శ్రీనివాస్ సింగ్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.


