పరేడ్‌ గ్రౌండ్‌లో ఓపెన్‌ హౌస్‌ | - | Sakshi
Sakshi News home page

పరేడ్‌ గ్రౌండ్‌లో ఓపెన్‌ హౌస్‌

Oct 27 2026 2:02 AM | Updated on Oct 27 2026 2:02 AM

నరసరావుపేట రూరల్‌: పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో సోమవారం ఓపెన్‌ హౌస్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి ఓపెన్‌ హౌస్‌ను ప్రారంభించారు. పట్టణంలోని పలు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు ఓపెన్‌ హోస్‌లో పాల్గొని పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాలను ఆసక్తిగా తిలకించారు. ఓపెన్‌హౌస్‌లో ఆడ్వాన్స్‌ వెపన్స్‌, షార్ట్‌ రేంజ్‌, లాంగ్‌ రేంజ్‌ వెపన్స్‌, హానికరం కాని ఆయుధాలు, గుంపులను చెదరగొట్టేందుకు వినియోగించే స్మోక్‌ గన్స్‌, డ్రోన్‌ కెమోరాలు, బాంబు డిస్సోజుల్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌, ఫోరెన్సిక్‌ పరిరకాలు, ట్రాఫిక్‌ పోలీసుల పరిరకాలు, హ్యాండ్‌ హోల్డ్‌ మెటల్‌ డిటెక్టర్‌, డోర్‌ ప్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్‌, రక్షణ హెల్మెట్లు, లాఠీలు, రైట్‌ గేర్‌ పరిరకాలు, వజ్ర వాహణం, మహిళా పోలీసు ప్రత్యేక దర్యాప్తు వాహనం, మొబైల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌, రక్షక్‌ వాహనాలను ప్రదర్శించారు. విద్యార్థులు పోలీసుల ఆయుధాలు, పరికరాలను ఆసక్తిగా తిలకించారు. పోలీసు సిబ్బంది వాటి వినియోగాన్ని, ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రోహిత్‌ కుమార్‌ చౌదరి, ఏఆర్‌ డీఎస్పీ గాంధీరెడ్డి, ఫింగర్‌ ప్రింట్‌ యూనిట్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.ఫణి, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.కృష్ణ, గోపినాథ్‌, యువరాజు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement