రేపల్లె: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రేపల్లెలో పాల్గొనే పేదల సేవలో కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సూచించారు. పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ చేయటంతో పాటు పట్టణంలో ప్రజావేదిక వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్, ప్రజా వేదిక, క్యాడర్ సమావేశ ప్రాంగణం తదితర ప్రాంతాలలో జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వేదిక నిర్మాణం, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై అధికారులకు చూచానులు చేశారు. సమావేశంలో రేపల్లె, చీరాల, బాపట్ల ఆర్డీఓలు బూసి శ్రీదేవి, నరసింహారావు, ఏ.హరికుమార్, మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు, డీఎస్పీ అబ్దుల్ అజీజ్, డిఆర్డీఏ, మెప్మా, గృహ నిర్మాణ సంస్థ పీడీలు బి.సింగయ్య, ఆనంద సత్యపాల్, వెంకటేశ్వరరావు, డీఎస్‌ఓ జగన్మోహన్, డీపీఓ ఎల్ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్


