నిత్యాన్నదాన పథకానికి విరాళం | - | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదాన పథకానికి విరాళం

Sep 29 2026 1:45 AM | Updated on Sep 29 2026 1:45 AM

నిత్యాన్నదాన పథకానికి విరాళం త్రికోటేశ్వరునికి వెండి రుద్రాక్షమాల బహూకరణ డిసెంబర్‌లో ఏపీ మాస్టర్‌ అథ్లెటిక్‌ పోటీలు హిందీని ప్రోత్సహించాలి

పెదకాకాని: మల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న నిత్యాన్నదాన ప్రసాద పథకానికి గుంటూరుకు చెందిన సంతోష్‌ హోండా షోరూమ్‌ అధినేత చుక్కపల్లి జగన్మోహనరావు, సీతాలక్ష్మి దంపతులు రూ.1,00,116 విరాళళం ఆలయ చైర్మన్‌ కోసూరి పూర్ణచంద్రరావుకు సోమవారం అందజేసినట్లు ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్‌ తెలిపారు. దాతలకు ప్రత్యేక దర్శనం, ఆలయ అర్చకస్వాములు, వేదపండితులచే వేద ఆశీర్వచనం చేయించి స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి, దివ్య ప్రసాదం చిత్రపటం అందజేశారు. కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యులు కొమ్మూరి మల్లికార్జునరావు, దూపాటి శివశంకరరావు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు పేటేటి ధనమహేశ్వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

నరసరావుపేట రూరల్‌: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి వారికి హైద్రాబాద్‌కు చెందిన సైయింట్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ పీఎన్‌ఎస్‌వీ నరసింహన్‌ 300 గ్రాముల వెండి రుద్రాక్షమాలను అందజేశారు. దాత తమ కుటుంబ సభ్యులతో కలసి సోమవారం ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రూ.83,295 విలువైన వెండి రుద్రాక్షమాలను బహుకరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ చంద్రశేఖర్‌, అర్చకులు పాల్గొన్నారు. అనంతరం దాతలకు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

గుంటూరువెస్ట్‌(క్రీడలు): ఏపీ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన డిసెంబర్‌ 12, 13వ తేదీల్లో అథ్లెటిక్‌ పోటీలు నిర్వహిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ లాల్‌ వజీర్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఒంగోలులో రాష్ట్ర కమిటీ సర్వ సభ్య సమావేంలో పలు నిర్ణయాలు తీసుకుందన్నారు. వివిధ క్రీడాంశాల్లో జరగనున్న పలు క్రీడా విభాగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాస్టర్స్‌ అథ్లెట్స్‌ పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర కమిటీ తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

లక్ష్మీపురం: ఈ–ఆఫీస్‌లో హిందీ వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గుంటూరు డివిజన్‌ రైల్వే మేనేజర్‌ సుథేష్ణ సేన్‌ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్‌ఎం కార్యాలయంలో డీఆర్‌ఎం అధ్యక్షతన సోమవారం అధికార భాష అమలు కమిటీ సమావేశం నిర్వహించారు. గత త్రైమాసికంలో డివిజన్‌ పరిధిలో అధికార భాష (హిందీ) అమలు, పురోగతిని సమీక్షించారు. హిందీలో నోటింగ్‌, డ్రాఫ్టింగ్‌, ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇ–ఆఫీస్‌లో హిందీ వినియోగం, అధికార భాషా కార్యశాలలు, ఇతర సంబంధిత కార్యకలాపాలపై నివేదిక సమర్చించారు. గుంటూరు అసిస్టెంట్‌ డివిజనల్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ వై.మార్కండేయులు సమర్పించారు. అదనపు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఎం. రమేష్‌కుమార్‌, సీనియర్‌ రాజ భాషా అధికారి హేమంత్‌ వాడేకర్‌, చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సి.శ్రీనివాసు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement