బాపట్ల: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్ది, ప్రజలకు, ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ సోమవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్ది, ప్రజలకు, ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యాలయ భవనం, వివిధ విభాగాల ఏర్పాట్లు, కార్యాలయ పరిసరాలు, మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పచ్చదనం పెంపొందించేలా మొక్కలు నాటాలన్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే కార్యాలయంలోని వివిధ విభాగాలను అవసరాలకు అనుగుణంగా సక్రమంగా ఏర్పాటు చేసి, ఉద్యోగులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు అనువైన వాతావరణం కల్పించాలని సూచించారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఆధునిక సదుపాయాలతో అభివద్ధి చేసేందుకు అవసరమైన చర్యలను ప్రాధాన్యతతో చేపట్టాలని పంచాయతీరాజ్, ఈఈ, ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ సత్యనారాయణ, డీఎల్‌డీఓ విజయలక్ష్మి, జెడ్పీ కార్యాలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్


