బాపట్ల: రేబీస్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట పేర్కొన్నారు. ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో పోస్టర్‌ను జేసీ ఆవిష్కరించారు. జేసీ మాట్లాడుతూ పెంపుడు జంతువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జంతువులకు క్రమం తప్పకుండా వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్‌ఓ లవన్న, డీఎంహెచ్‌ఓ విజయమ్మ, డేటా మేనేజర్ లక్ష్మణ్, ఎపిడెమియాలజిస్ట్, ప్రోగ్రామ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట


