తెనాలిరూరల్: మురుగు కాల్వలో పడి పరోటా మాస్టర్ మృతి చెందిన ఘటన తెనాలిలో జరిగింది. బాపట్ల జిల్లా ఈపూరుపాలెంకు చెందిన ఆకురాతి శివ(38) వంట మాస్టర్‌గా పని చేస్తుంటాడు. భార్యతో విడాకులు తీసుకుని తెనాలి వచ్చి మారీస్‌పేటలో గది అద్దెకు తీసుకుని స్థానికంగా హోటళ్లలో పని చేస్తున్నాడు. మద్యం తాగిన మత్తులో మురుగు కాల్వలో పడి మృతి చెందాడు. మృతదేహాన్ని సోమవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు. ఆదివారం రాత్రి కాల్వలో పడి ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


