ఖాకీల గూండాగిరి | - | Sakshi
Sakshi News home page

ఖాకీల గూండాగిరి

Sep 22 2026 5:16 AM | Updated on Sep 22 2026 5:16 AM

మంగళవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 కాకుమాను బజార్‌ లడ్డూ రూ.9.30 లక్షలు నేడు సహస్ర మోదక గణపతి హోమం డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌ సీపీ ఆగ్రహ జ్వాల ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?

న్యూస్‌రీల్‌

లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే

సీబీఐ విచారణకు భయమెందుకు?

వైఎస్సార్‌ సీపీ శ్రేణుల

అడ్డగింత

పోలీసుల చేతుల్లోని లాఠీలను లాక్కొని టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు

శాంతియుతంగా నిరసన తెలిపితే పోలీసుస్టేషన్‌లో నిర్బంధిస్తారా?

ప్రశ్నించిన వైఎస్సార్‌ సీపీ గుంటూరు

జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు

శాంతిర్యాలీకి వెళుతున్న నేతలను అడ్డుకుని పెదకాకాని పీఎస్‌కు తరలించిన పోలీసులు

పెదకాకాని పీఎస్‌లో వైఎస్సార్‌ సీపీ నాయకులు అంబటి రాంబాబు, మురళీకృష్ణ, నూరిఫాతిమా, వనమా, గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి, అన్నాబత్తుని

కాజా టోల్‌ప్లాజా వద్ద ఉద్రిక్తత

31 మంది నేతలకు 41 నోటీసులు

ప్రతిరోజూ కొత్త ఆధారాలు ..

డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి అరెస్ట్‌

శాంతిర్యాలీని అడ్డుకోవడం దుర్మార్గం

మంగళవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026
శాంతి ర్యాలీపై

గొప్ప సంఘసంస్కర్త

గురజాడ

గుంటూరు ఎడ్యుకేషన్‌: దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గురజాడ అప్పారావు సమాజంలో మార్పులు తెచ్చి గొప్ప సంస్కర్తగా నిలిచారని జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో ప్రముఖ కవి, రచయిత, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం నిర్వహించారు. గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించిన హెనీ క్రిస్టినా మాట్లాడుతూ.. గురజాడ తెలుగు సాహిత్యానికి అందించిన విశిష్ట సేవలు, సమాజ సంస్కరణకు ఆయన చేసిన కృషి మరువలేనివన్నారు. దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌ అనే మహోన్నత సందేశం ద్వారా సమాజంలో మానవతా విలువలు, సామాజిక బాధ్యతలపై స్పృహ కల్పించారన్నారు. ఏఓ శామ్యూల్‌ పాల్‌, ఉద్యోగులు రత్నబాబు, మల్లేశ్వరరావు, శ్రీనివాస్‌, రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

నరసరావుపేట ఈస్ట్‌: గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కాకుమాను బజార్‌లో ఏర్పాటు చేసిన పందిరిలోని గణనాథుడి 51 కిలోల లడ్డూ వేలం ఆదివారం రాత్రి నిర్వహించారు. వేలంపాటలో గుర్రపుసాల సిద్ధార్థ్‌ రూ.9,30,116లకు లడ్డూను దక్కించుకున్నాడు. కాకుమాను బజార్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 27వ వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన పందిరిలోని లడ్డూను వేలంలో దక్కించుకున్న సిద్ధార్థ్‌ గృహానికి మేళతాళాలలో తీసుకవెళ్లారు. కాగా, పందిరిలో పూజలందుకున్న భారీ గణనాఽథుడిని సోమవారం రాత్రి నిమజ్జనానికి తరలిస్తున్నారు.

పెదకాకాని: పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం భక్తులచే విశేషమైన సహస్ర మోదక గణపతి హోమం నిర్వహించనున్నట్లు ఆలయ డీసీ గోగినేని లీలాకుమార్‌, పాలకమండలి చైర్మన్‌ కోసూరి పూర్ణచంద్రరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 23వ తేదీన వినాయక స్వామివారి నిమజ్జనం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. మంగళవారం జరిగే సహస్ర మోదక గణపతి హోమంలో భక్తులు రూ.2,500 చెల్లించి పూజా కార్యక్రమంలో నేరుగా పాల్గొనవచ్చన్నారు.

మద్యం షాపుల రెన్యువల్‌ గడువు పెంపు

నరసరావుపేట టౌన్‌: మద్యం షాపుల లైసెన్స్‌ రెన్యువల్‌ దరఖాస్తుకు మరో రెండు రోజులు సమయం పొడిగించినట్లు ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ మణికంఠ తెలిపారు. సోమవారం నరసరావుపేటలోని ఎకై ్సజ్‌ స్టేషన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్నాడు జిల్లాలో 142 మద్యం షాపుల లైసెన్స్‌ రెన్యువల్‌కు నోటిఫికేషన్‌ ఇవ్వగా సోమవారం చివరి రోజు 112 దుకాణాలకు నిర్వాహకులు రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇక 23 మద్యం దుకాణాలకు రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వం మరో రెండు రోజులు గడువు పెంచిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

బాలుడిపై అఘాయిత్యం

సాక్షిటాస్క్‌ఫోర్స్‌: మండల కేంద్రానికి సమీప గ్రామంలో ఆరేళ్ల బాలుడిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఆరేళ్ల బాలుడు ఇంట్లో ఆడుకుంటుండగా, అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంట్లో బాలుడు ఏడుస్తుండగా తల్లిదండ్రులు నిలదీయగా జరిగిన విషయాన్ని బాలుడు చెప్పాడు. ఘటనపై బాలుడి తల్లిదండ్రులు ముప్పాళ్ళ పోలీసులను ఆశ్రయించారు.

పెదకాకాని/మంగళగిరి రూరల్‌: డీఎస్సీలో అక్రమాలకు పాల్పడిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేసే వరకూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం ఆపదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు విజయవాడ శాప్‌ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు సోమవారం గుంటూరు జిల్లా నుంచి పలువురు నాయకులు బయలుదేరారు. ఈక్రమంలో ఒక పథకం ప్రకారం ముందుగానే కాజ టోల్‌గేట్‌ వద్దకు పోలీసులు పెద్దఎత్తున చేరుకున్నారు. గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. ఆ సమయంలో శాప్‌ కార్యాలయానికి వెళుతున్న వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, గుంటూరు తూర్పు సమన్వయకర్త షేక్‌ నూరి ఫాతిమా, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబులతో పాటు 27 మందిని అదుపులోకి తీసుకుని పెదకాకాని పోలీసుస్టేషన్‌లో నిర్బంధించారు. నేతల ప్రయాణిస్తున్న కార్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం శాప్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం ముగిసినట్లు సమాచారం రావడంతో 31 మందికి 41 నోటీసులు ఇచ్చి పంపించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడారు.

పోలీసుల లాఠీలు టీడీపీ గూండాల చేతిలోనా?

డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని లేదంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. విజయవాడ శాప్‌ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమానికి బయలు దేరి వెళుతుంటే అడ్డుకుని పోలీసుస్టేషన్‌కు తరలించి నిర్భందించడం కూటమి బరితెగింపునకు నిదర్శమన్నారు. పోలీసు వ్యవస్థను నారా లోకేష్‌ దుర్వినియోగం చేస్తున్నాడన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై అప్పటికే శాప్‌ కార్యాలయానికి చేరుకున్న కూటమి నాయకులు, కార్యకర్తలు పోలీసుల వద్ద నుంచి లాఠీలు లాక్కొని దాడులు చేస్తున్నారంటే ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుందన్నారు. నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖామంత్రి రాజీనామా చేస్తే కనీస రాజకీయ పరిజ్ఞానం లేని నారా లోకేష్‌ టీడీపీ గూండాలచే దాడులు చేయిస్తూ దుష్ట సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. నకిలీ స్పోర్ట్స్‌ సర్టిఫికెట్‌లతో దొడ్డి దారిన ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా టీడీపీ గూండాలతో దాడులు చేయిస్తున్న లోకేష్‌ అక్రమాలు, దాడులపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. డీఎస్సీలో అక్రమాలు చేసేందుకే కొత్త జీఓలు తీసుకువచ్చారన్నారు. నియామకాలు పూర్తి కాగానే ఆ జోవోను రద్దు చేయడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి, తెనాలి సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌, పొన్నూరు, గుంటూరు, తాడికొండ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్‌ సీపీ నాయకులు, అనుబంధ విభాగాలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే కోడిగుడ్లతో, కర్రలతో దాడులు, అడ్డగింతలు, అరెస్టులు చేస్తారా అని వైఎస్సార్‌ సీపీ తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు(డైమండ్‌బాబు) ధ్వజమెత్తారు. 3 లక్షల మందికి పైగా నిరుద్యోగులు డీఎస్సీ పరీక్ష రాస్తే విద్యాశాఖామంత్రి నారా లోకేష్‌ స్పోర్ట్స్‌ కోటా సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళుతుంటే కాజా టోల్‌గేట్‌ వద్ద వాహనాలను అడ్డుకుని భయానక వాతావరణాన్ని సృష్టించారన్నారు. పోలీసుస్టేషన్‌కు తరలించి నిర్బంధించడం దారుణం. ప్రజా ప్రతినిధులు అనే గౌరవం కూడా లేకుండా ఈడ్చిపారేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కుప్పకూలే వరకూ అన్యాయాలు, అక్రమాలపై వైఎస్సార్‌ సీపీ పోరాడుతూనే ఉంటుందని బాలవజ్రబాబు స్పష్టం చేశారు.

కొల్లూరు: డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుటిల యత్నాలకు దిగింది. పోలీసులను ఎక్కడికక్కడ కాపాలాగా పెట్టి విజయవాడ వెళుతున్న వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, నాయకులను అడ్డగించి నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులతో అడ్డగింపజేశారు. సోమవారం కొల్లూరు కరకట్టపై ఎస్‌ఐ కిశోర్‌బాబు నేతృత్వంలో పోలీసులు తెల్లవారుజాము నుంచి మొహరించారు. వేమూరు, రేపల్లె నియోజకవర్గాల నుంచి విజయవాడ శాప్‌ కార్యాలయం వద్దకు తరలివెళ్లే వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను అడ్డగించేందుకు పికెటింగ్‌ నిర్వహించారు. కొల్లూరు నుంచి చిలుమూరు వరకు కరకట్ట మార్గాన్ని డేగ కళ్లతో పర్యవేక్షించిన పోలీసులు రేపల్లె నియోజకవర్గం నగరం ప్రాంతం నుంచి నిరసన కార్యక్రమానికి తరలివెళుతున్న సుమారు 20 మందికి పైగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులను ఈపూరు వద్ద అడ్డగించారు. విజయవాడ తరలివెళ్లకుండా వైఎస్సార్‌ సీపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని వేమూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు.

డీఎస్సీ– 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరితే కూటమి ప్రభుత్వానికి భయమెందుకో అర్ధం కావడం లేదని వైఎస్సార్‌ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌ సీపీ చేపట్టిన పోరుబాటను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసు ఆంక్షలను ప్రయోగించిందన్నారు. మరోవైపు శాప్‌ కార్యాలయం వద్ద వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై టీడీపీ వర్గాలు కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డాయన్నారు. టీడీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ చేపట్టే వరకూ వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాలపై సీబీఐ విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని అంబటి మురళీకృష్ణ డిమాండ్‌ చేశారు.

డీఎస్సీ స్కామ్‌లో చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలు ప్రతిరోజు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయని వైఎస్సార్‌ సీపీ గుంటూరు తూర్పు సమన్వయకర్త షేక్‌ నూరి ఫాతిమా అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ తప్పులను, అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తే ఎదురు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. శాప్‌ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారన్నారు. శాప్‌ కార్యాలయంలోకి కూటమి గూండాలను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ రెడ్‌బుక్‌ రాజ్యాంగం పరిధిలో పనిచేస్తుందన్నారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్‌ రాజీనామా చేయాలని నూరిఫాతిమా డిమాండ్‌ చేశారు.

బాపట్ల: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలంటూ విజయవాడలోని శాప్‌ కార్యాలయం వద్ద సోమ వారం వైఎస్సార్‌ సీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతిని పోలీసులు బాప ట్ల మండలం చుండూరుపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు బయలుదేరిన కోన రఘుపతిని పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కోన రఘుపతి మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై ప్రశ్నలు లేవనెత్తినందుకే తమను అరెస్ట్‌ చేయడం ప్రజాస్వామ్యవిరుద్ధమన్నారు. స్పోర్ట్స్‌ కోటాలో అనర్హులకు అక్రమంగా ఉద్యోగాలు కట్టబెట్టడం సరికాదన్నారు. వైఎస్సార్‌ సీపీ ఆధారాలతో చూపుతున్న వాటికి బదులు చెప్పలేక నిరసనలను అడ్డుకోవటమే ప్రధాన అజెండాగా సర్కారు ముందుకుపోతోందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా విజయవాడ వెళ్లకుండా అడ్డుకోవటంతో బాపట్ల–గుంటూరు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసు వాహనంలో ఆయనను బాపట్ల తరలించి గృహ నిర్బంధంలో ఉంచారు.

తాడేపల్లి రూరల్‌: డీఎస్సీ కుంభకోణంపై విజయవాడలోని శాప్‌ కార్యాలయం వద్దకు నిరసనకు వెళ్తున్న వైఎస్సార్‌ సీపీ తాడేపల్లి, మంగళగిరి నేతలను పోలీసులు సోమవారం ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుకున్నారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై నిరసన తెలిపేందుకు పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి తన కార్యకర్తలతో కలిసి విజయవాడ శాప్‌ కార్యాలయానికి బయలుదేరారు. దీంతో పోలీసులు ప్రకాశం బ్యారేజీ వద్ద వారిని అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేస్తున్న ధర్నాను అడ్డుకోవడం సరికాదని వేమారెడ్డి పోలీసులతో అన్నారు. కొద్దిసేపు పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement