చిరస్మరణీయుడు గురజాడ అప్పారావు | - | Sakshi
Sakshi News home page

చిరస్మరణీయుడు గురజాడ అప్పారావు

Sep 22 2026 5:16 AM | Updated on Sep 22 2026 5:16 AM

బాపట్ల: దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌ అంటూ మానవత, ఐకమత్యాన్ని చాటి చెప్పిన ఘనత గురజాడ అప్పారావు కే దక్కుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన గురజాడ అప్పారావు చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌, జిల్లా జేసీ భావన వశిష్ఠ పుష్పమాలలతో ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గొప్ప సామాజిక సంఘసంస్కర్త గా అప్పారావు చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఎన్నో రచనలతో సమాజాన్ని మేల్కొలిపారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మన రాష్ట్రంలో జన్మించడం గర్వకారణమన్నారు. జేసీ మాట్లాడారు. జిల్లా ఇన్‌చార్జి డీఆర్‌ఓ లవన్న, డీఆర్డీఏ పీడీ బి.సింగయ్య, డ్వామా పీడీ ఏ.వి.విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.విజయమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వాతావరణానికి అనుగుణంగా పంటలు ..

బాపట్ల: తమ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, నేల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటలు సాగు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ రైతులకు సూచించారు. పి.వి.పాలెం మండలం సంగుపాలెం కోడూరు గ్రామ పరిధిలో వర్షాభావ పరిస్థితుల కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను కలెక్టర్‌ రైతులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు.

గురజాడ అప్పారావుకు కలెక్టర్‌ ఘననివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement