పీజీఆర్‌ఎస్‌ అర్జీలకు సత్వర పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌ అర్జీలకు సత్వర పరిష్కారం

Sep 22 2026 5:16 AM | Updated on Sep 22 2026 5:16 AM

బాపట్ల: పీజీఆర్‌ఎస్‌లో నమోదయ్యే అర్జీల పరిష్కారంలో అధికారులు రాకెట్‌ వేగంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చి న ప్రజలు వినతి పత్రాల ద్వారా సమస్యలను కలెక్టర్‌ కు విన్నవించారు. 194 అర్జీలు నమోదు కాగా, తన పరిధిలో ఉన్న వాటికి జిల్లా కలెక్టర్‌ అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపారు. మిగిలిన వాటిలో కొన్నిటిని పరిశీలన, మరికొన్నిటిని విచారణకు ఆదేశించారు. నమోదయ్యే అర్జీలను గడువులోగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. ఫొటో నవీకరణలో వేమూరులోని బీఎల్‌ఓ వద్ద 206 అర్జీలు పెండింగ్‌ ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. చీరాల మున్సిపాలిటీలో 1,002 అర్జీలు ఫొటో అప్లోడ్‌ కోసం పెండింగ్‌ లో ఉండడంపై ప్రశ్నించారు. ఫిర్యాదులపై సత్వరం స్పందించి పరిష్కారం చూపుతున్న ఎన్టీఆర్‌ భరో సా జిల్లా కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ను కలెక్టర్‌ అభినందించారు. జేసీ భావన వశిష్ఠ, ఇన్‌చార్జీ డీఆర్‌ ఓ లవన్న, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement