గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్‌

Sep 21 2026 6:47 AM | Updated on Sep 21 2026 6:47 AM

గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్‌ చుండూరు(వేమూరు): గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్లు చుండూరు సీఐ ఆనందరావు చెప్పారు. చుండూరు మండలం మోదుకూరు గ్రామ శివారులోని పాడుబడిన హాస్టల్‌ భవనంలో కొంత మంది వ్యక్తులు గంజాయి సేవిస్తున్నారు. సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఇద్దరిని అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 430 గ్రాముల గంజాయి, 9 టాపెంటాడోల్‌ టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కంభాల శ్రీనాథ్‌రెడ్డి, మువ్వ వంశీలను తెనాలి న్యాయస్థానంలో హాజరుపర్చారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించారు. ఆగి ఉన్న లారీని బైకు ఢీకొని ఒకరు మృతి కారంచేడు: వాడరేవు పిడుగురాళ్ళ జాతీయ రహదారిపై కారంచేడు పరిధిలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బోడవాడ గ్రామానికి చెందిన కమ్మ కోటేశ్వరరావు(49), పోతురాజు బ్రహ్మం.. ద్విచక్రవాహనంపై వినాయక నిమజ్జనానికి వెళ్ళి వస్తూ ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో కమ్మ కోటేశ్వరరావు మృతి చెందాడు. మరో వ్యక్తి బ్రహ్మం తీవ్ర గాయాల పాలవడంతో వైద్యచికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయ ద్వారాలు మూసివేత డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో రూ.3.32 లక్షలకు టోకరా

21 నుంచి 20 రోజుల పాటు తూర్పు, ఉత్తర ద్వారాలు బంధనం భక్తులు దక్షిణ గాలి గోపురం నుంచి స్వామివారి దర్శనంచేసుకునేలా ఏర్పాట్లు

మరొకరికి గాయాలు

మంగళగిరి టౌన్‌: మంగళగిరి పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఆలయ మరమ్మతు పనుల నేపథ్యంలో భక్తులకు దర్శన మార్గంలో మార్పులు చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్‌ కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయ మరమ్మతుల్లో భాగంగా శ్రీ కృష్ణదేవరాయ ముఖమండపం తొలగింపు పనులు చేపట్టనున్న నేపథ్యంలో సెప్టెంబర్‌ 21, 2026 నుంచి 20 రోజుల పాటు ఆలయంలోని తూర్పు, ఉత్తర ద్వారాలను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు దక్షిణ గాలి గోపురం మార్గం ద్వారా దర్శనం చేసుకోవాలని సూచించారు. మరమ్మతు పనుల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని ఆలయ అధికారులు కోరారు.

లక్ష్మీపురం: డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో ఓ బ్యాంక్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ను బెదిరించి రూ.3.32 లక్షలు నగదు ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్న వ్యక్తి పై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు మల్లికార్జున పేటకు చెందిన దేవరపల్లి రాజేష్‌ అనే వ్యక్తి ఓ ప్రైవేట్‌ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది జూలై 22న గుర్తుతెలియని వ్యక్తి రాజేష్‌కు ఫోన్‌ చేసి తనను బాపట్ల ఎస్‌ఐగా పరిచయం చేసుకొన్నారు.

రాజేష్‌పై సోషల్‌ మీడియా ద్వారా ఒక ఫిర్యాదు వచ్చినట్లు ఆ విషయమై రాజేష్‌ను డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తున్నట్లు బెదిరించడంతో బాధితుడు భయాందోళనకు గురయ్యాడు. ఈ వ్యవహారం అయి జూలై 22 నుంచి 31వ తేదీ లోపు పలు దఫాలు గా రూ.3.32 లక్షలు వరకు గుర్తు తెలియని వ్యక్తి ఖాతాలోకి బదిలీ చేశాడు. బాధితుడుకి అనుమానం కలిగి విచారించగా బెదిరించి తన వద్ద డబ్బు కాజేశారని దీన్ని సైబర్‌ క్రైంగా గ్రహించాడు. దీంతో బాధితుడు రాజేష్‌ అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement