పల్నాడు జిల్లాలో సగటు వర్షపాతం 11.40 మి.మీటర్లు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు జిల్లాలో సగటు వర్షపాతం 11.40 మి.మీటర్లు

Sep 21 2026 6:35 AM | Updated on Sep 21 2026 6:35 AM

పల్నాడు జిల్లాలో సగటు వర్షపాతం 11.40 మి.మీటర్లు కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 17 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా మేడికొండూరు మండలంలో 25.4 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా తుళ్లూరు మండలంలో 0.4 మి.మీ వర్షం కురిసింది. సగటున 11.40 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. పెదకాకాని మండలంలో 25 మి.మీ., గుంటూరు తూర్పు 22, తెనాలి 20.4, గుంటూరు పశ్చిమ 18.2, దుగ్గిరాల 17.6, చేబ్రోలు 16.4, కాకుమాను 13.4, పెదనందిపాడు 10.2, పొన్నూరు 8.6, కొల్లిపర 7.6, ప్రత్తిపాడు 6.4, వట్టిచెరుకూరు 5.2, ఫిరంగిపురం 4.2, తాడికొండ 2.6, మంగళగిరి మండలంలో 1.8 మి.మీ చొప్పున వర్షం కురిసింది. సెప్టెంబర్‌ నెల 20వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 96.8 మి.మీ పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 132 మి.మీ వర్షపాతం నమోదైంది. రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో జీవించాలి ప్రారంభమైన అంతర్‌జిల్లాల ఈత పోటీలు 125 రకాల ప్రసాదాలతో గణనాథుడికి నైవేద్యం

నగరంపాలెం: జిల్లాలోని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్లకు ఆదివారం ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు ఈ పక్రియను సీఐలు చేపట్టారు. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయవద్దని రౌడీషీటర్లకు సూచించారు. బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని అన్నారు. చెడు స్నేహాలు, అసాంఘిక కార్యకలాపాలు, నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలని హితవు పలికారు. ప్రజల ప్రశాంతతకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని స్పష్టంచేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నేరాలకు దూరంగా ఉంటూ, సమాజంలో ప్రశాంతంగా జీవించే రౌడీషీటర్లకు పోలీసుల పక్షాన సహకారం అందిస్తామని చెప్పారు.

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): ఆంధ్ర ప్రదేశ్‌ అమెచ్యూర్‌ ఆక్వాటిక్‌ అసోసియేషన్‌, గుంటూరు జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ సంయుక్తాధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్టీఆర్‌ మునిసిపల్‌ స్టేడియం స్విమ్మింగ్‌ పూల్‌లో నిర్వహించిన ప్రథమ షార్ట్‌ కోర్స్‌ సీనియర్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ చాంపియన్‌షిప్‌– 2026 పోటీలను స్టేడియం కార్యదర్శి వజ్జా రామకృష్ణ, కోశాధికారి ఖండే కాంతారావు లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి షేక్‌ ఖాజా మొహిద్దీన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 64 మంది బాల బాలికలు పాల్గొన్నారన్నారు. పోటీలలో అద్భుత ప్రదర్శన చూపిన బాల బాలికలను వచ్చే నెల 26 నుంచి 30వ తేదీ వర కు అహ్మదాబాద్‌ లో జరిగే ప్రథమ షార్ట్‌ కోర్స్‌ సీనియర్‌ జాతీయస్థాయి ఈత పోటీలలో పాల్గొంటారన్నారు. అనంతరం చిన్నారులు పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ అమెచ్యూర్‌ ఆక్వాటిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎ.మోహన్‌ వెంకటరామ్‌, అధ్యక్షు లు డాక్టర్‌ ఓబుల్‌ రెడ్డి, కోశాధికారి రమేష్‌, జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రాయపాటి రామ నరసింహారావు పాల్గొన్నారు.

మంగళగిరి టౌన్‌: మంగళగిరి పట్టణం, ఆత్మకూరు ఇప్పటం రోడ్డులో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం వద్ద శనివారం రాత్రి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి 125 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. స్థానిక మహిళలు భక్తిశ్రద్ధలతో వివిధ రకాల ప్రసాదాలను ప్రత్యేకంగా తయారు చేసి, గణనాథుడికి సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో స్థానికులు కార్యక్రమంలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వినాయక ఉత్సవాల్లో భాగంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులకు వివిధ రకాల ఆటల పోటీలను కూడా నిర్వహించారు. పిల్లలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు. ఉత్సవ ప్రాంగణంలో భక్తులు, స్థానికులు సందడి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement