మానసిక ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు, వ్యక్తిగత పరిశుభ్రత లోపించటం, అపాయింట్‌మెంట్స్ మర్చిపోవటం, జ్ఙాపకశక్తిని కోల్పోవటం వ్యాధిగ్రస్తుల్లో కనిపిస్తాయి. పసి పిల్లవాడికి ఏవిధంగా స్నానం చేయమని చెప్పాలో అదేవిధంగా అల్జీమర్స్ వ్యాధి గ్రస్తులకు ప్రతి ఒక్క విషయం గుర్తుచేయాలి. వ్యాధి రాకుండా ముందస్తు చర్యలో భాగంగా పుస్తకాలు చదవాలి. చెస్ ఆడటం, పజిల్స్ ఆడటం, మ్యూజికల్ వస్తువులు ప్లే చేయటం, పౌష్టికాహారం తీసుకోవాలి. మందు, సిగిరెట్లు మానివేయాలి. సామాజిక బంధాలు పెంచుకోవాలి. ప్రాథమిక దశలోనే వ్యాధి లక్షణాలను గుర్తించి వైద్యం చేయటం ద్వారా వ్యాధిని నివారించవచ్చు.
– డాక్టర్ పమిడిముక్కల విజయ, వరల్డ్ స్ట్రోక్ అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్


