అల్జీమర్స్‌.. బహుపరాక్‌! | - | Sakshi
Sakshi News home page

అల్జీమర్స్‌.. బహుపరాక్‌!

Sep 21 2026 6:35 AM | Updated on Sep 21 2026 6:35 AM

అల్జీమర్స్‌.. బహుపరాక్‌!

అల్జీమర్స్‌ సోకితే అన్ని మరిచిపోతారు ప్రతి ఏడాది పెరుగుతున్న మతిమరుపు బాధితులు ముందస్తు జాగ్రత్తలతో కట్టడి చేయవచ్చంటున్న వైద్యులు నేడు వరల్డ్‌ అల్జీమర్స్‌ డే

వ్యాధి లక్షణాలు

గుంటూరు మెడికల్‌: వయస్సు పెరుగుతున్న కొద్ది మతిమరుపు రావటం సహజంగా జరుగుతుంది. దీనినే అల్జీమర్స్‌ వ్యాధి అంటారు. ప్రతి మూడు సెకన్లకు ఒకరు వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో విదేశాల్లో మాత్రమే ఈ మతిమరుపు వ్యాధిబారిన పడే వారిసంఖ్య అధికంగాఉండేది. నేడు మనదేశంలో కూడా మతిమరుపు బాధితుల సంఖ్య పెరిగిపోయింది. ఆధునిక జీవనశైలి వల్ల యువతలో కూడా వ్యాధి పెరిగిపోవటం ఆందోళనకరమైన అంశమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. దేశంలో సుమారు 8.8 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. బాధితుల సంఖ్య 2030 నాటికి రెట్టింపు అయ్యే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వయస్సు 60 దాటిన వారిలో 7.4శాతం మంది వ్యాధి బాధితులు ఉన్నారు. ఇంటినుంచిబయలుదేరిన వ్యక్తి కొంతదూరం వెళ్ళాక ఇంటి అడ్రస్‌ మర్చిపోవటం, తన పేరు కూడా రోగి మర్చిపోయే స్థితికి చేరుకోవటం ఈ జబ్బు లక్షణం. జబ్బు సోకిన వారికి సహాయకులుగా ఉండేవారికి అవగాహన కల్పించటం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ 1994 నుంచి ఏటా సెప్టెంబర్‌ 21న అల్జీమర్స్‌ డే నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ‘సాక్షి ’అందిస్తున్న ప్రత్యేక కథనం.

ప్రతిరోజూ 30 మందికి చికిత్స..

అల్జీమర్స్‌ వ్యాధికి చికిత్స కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న 30 మంది మానసిక వైద్యనిపుణులు, 15 మంది న్యూరాలజిస్టులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు వారంలో ఇరువురు లేదా ముగ్గురు వ్యాధి బాధితులు చికిత్స కోసం వస్తున్నారని వైద్యులు తెలిపారు. గుంటూరు జీజీహెచ్‌కు ప్రతివారం ఇరువురు కొత్తగా వ్యాధి సోకినవారు, పదిమంది పాతరోగులు వ్యాధితో బాధపడుతూ ప్రతిరోజూ చికిత్స కోసం వస్తున్నారు. ప్రతి శనివారం న్యూరాలజీ ఓపీ విభాగంలో అల్జీమర్స్‌ వ్యాధి బాధితుల కోసం ప్రత్యేకంగా ఓపీ వైద్యసేవలు అందిస్తున్నారు.

రోజువారి పనులు మరిచిపోతారు

వ్యాధి గ్రస్తులు రోజు వారీ కార్యక్రమాలు మర్చిపోతారు. స్నానం చేయటం, బ్రష్‌ చేయటం, తిండితినటం కూడా మర్చిపోతారు. వస్తువులను ఎక్కడో పెట్టి ఆ విషయాన్ని మర్చిపోయి ఎవరో దొంగిలించినట్లుగా అనుమానించటం, చెప్పిన విషయాన్నే పదే పదే చెప్పటం, వస్తువుల పేర్లు మర్చిపోవటం, వాటిని ఏ విధంగా వినియోగించాలో, ఎందునిమిత్తం వినియోగించాలో అనే అంశాలను సైతం మర్చిపోవటం రోగిలో కనిపిస్తాయి. ఇంటికి తాళాలు వేయటం, కూరలో ఉప్పువేయటం, పాలల్లో తోడు వేయటం వంటివి మర్చిపోవటం వ్యాధి గ్రస్తుల్లో కనిపిస్తాయి.

వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్‌ వ్యాధి సోకిన వారు తమ పేరు మర్చిపోతారు. ఒకేచోట కూర్చుని వీడియోగేమ్స్‌, టీవీలు చూస్తూ ఉండటం, అతిగా మద్యం సేవించటం, శారీరక, మానసిక వ్యాయామం లేకపోవటం, అధికకొవ్వు ఉన్న మాంసం తినటం వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. బంధువుల, కుటుంబ సభ్యుల పేర్లు మర్చిపోతారు. పేర్లు మర్చిపోవటంతోపాటుగా వారిని గుర్తించటం కూడా కష్టమే. ఈ వ్యాధి ఎక్కువగా 60 సంవత్సరాలు దాటిన వారిలో వస్తోంది. నేడు 45 ఏళ్ల వారిలో కూడా వ్యాధి లక్షణాలు కనిపించటం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement