పక్షవాతం వచ్చిన వారికి మతిమరుపు వస్తుంది. ఇంట్లో ఎవరైనా వ్యాధి బాధితులు ఉంటే ఇతర సభ్యులు ముందస్తుగా అవగాహన కల్గి ఉండి వైద్య పరీక్షలు చేయించుకోవటం చాలా మంచిది. అల్జీమర్స్ వ్యాధి గ్రస్తులకు గుంటూరు జీజీహెచ్‌లో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నాం. ఓపీ విభాగంలో ప్రతి శనివారం ప్రత్యేకంగా మెమరీక్లీనిక్‌ను ఓపీలో ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నాం. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు నేడు అత్యాధునిక వైద్య పద్థతులు అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి, ప్రిన్సిపాల్, గుంటూరు వైద్య కళాశాల.


