బ్యాంకు ఉద్యోగుల ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌ | - | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఉద్యోగుల ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌

Sep 21 2026 6:29 AM | Updated on Sep 21 2026 6:29 AM

కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌(యూఎఫ్‌బీయూ) దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో సోషల్‌ మీడియా క్యాంపెయిన్‌ నిర్వహించింది. ఇందులో భాగంగా గుంటూరు నగరంపాలెంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) మెయిన్‌ బ్రాంచి వద్ద ఆదివారం బ్యాంకు అధికారులు, ఉద్యోగులు తమ నిరసన తెలిపారు. యూఎఫ్‌బీయూ నాయకులు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో సోషల్‌ మీడియా క్యాంపెయిన్‌ నిర్వహించినట్లు తెలిపారు. వారానికి ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఐబీఏతో 123వ జాయింట్‌ నోట్‌పై సంతకాలు జరిగి చాలాకాలం గడిచినా ఐదు రోజుల పని దినాలపై నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు. శనివారం సెలవు ఇస్తే రోజువారీ పని వేళలను 40 నిమిషాలు పెంచేందుకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే నోటిఫై చేయాలని కోరారు. ప్రధానంగా పెన్షన్‌, కుటుంబ పెన్షన్‌ సవరణ, పెన్షనర్లకు ఐబీ వర్తింపజేయడం వంటి అంశాలపై కూడా యూఎఫ్‌బీయూ పోరాటం చేస్తోందని తెలిపారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 28, 29, 30 తేదీల్లో వరుసగా మూడు రోజులపాటు మహా సమ్మెను చేపట్టనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వివిధ బ్యాంకు యూనియన్ల నాయకులు కేఆర్‌వీ జయకుమార్‌, కె.కోటిరెడ్డి, వి.నరేంద్రకుమార్‌, పీఎస్‌ రంగసాయి, ఎం.పావని, సుధీర్‌, వెంకట్‌, కళ్యాణ్‌, మురళీకృష్ణ, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement