కర్లపాలెం(బాపట్లటౌన్): మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధనరెడ్డి భార్య వెంకటేశ్వరమ్మ(74) శనివారం మృతిచెందారు. మృతురాలికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని కర్లపాలెంలోని కుమారుడు ఇంటివద్దనే అభిమానుల సందర్శనార్ధం ఉంచారు. ఆదివారం ఉదయం స్వగ్రామమైన ఏట్రవారిపాలెంలోని హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు మాజీ ఎమ్మెల్యే గోవర్ధనరెడ్డిని పరామర్శించి తమ సంతాపాన్ని తెలియజేశారు.
సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
బాపట్ల : మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్దన్‌రెడ్డి సతీమణి వెంకటేశ్వరమ్మ మృతదేహానికి మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పూలమాల వేసి నివాళులర్పించారు. గోవర్దన్‌రెడ్డిని పరామర్శించి సానుభూతి తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు మోదుగుల బసవపున్నారెడ్డి, చేజర్ల నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు యల్లావుల ఏడుకొండలు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, భార్గవి సురేష్,ఆట్ల నాగేశ్వరరెడ్డి, అయ్యప్పరెడ్డి, కావూరి శ్రీనివాసరెడ్డి, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, బుల్లిరెడ్డి,జాలిరామిరెడ్డి తదితరులు ఉన్నారు.


