తెనాలిరూరల్: తెనాలి–విజయవాడ ప్రధాన రహదారిపై నందివెలుగు సమీపంలో శనివారం ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికుల సమాచారం ప్రకారం.. తెనాలి నుంచి మంగళగిరి వైపు కారు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయసున్న మహిళ కారు నడుపుతూ వస్తుండగా వేగం అదుపు తప్పడంతో రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి కారు దూసుకెళ్లి బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి, 108 అంబులెన్‌న్స్‌కు సమాచారం అందించారు. అనంతరం మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదం కారణంగా రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.


