మా మొర ఆలకించండి మహాప్రభో.. | - | Sakshi
Sakshi News home page

మా మొర ఆలకించండి మహాప్రభో..

Sep 18 2026 2:03 AM | Updated on Sep 18 2026 2:03 AM

కాంట్రాక్ట్‌ ఉద్యోగులు

బాపట్లటౌన్‌: ఆందోళన చేయడం మా అభిమతం కాదు..ఆవేదనతో గళం విప్పుతున్నాం.మా మొరపై ఆలోచించండి మహాప్రభో అంటూ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంఘం జేఏసీ సభ్యులు కూరపాటి సత్యంరాజు డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ఏరియా వైద్యశాల ఆవరణంలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ముందు ప్లేకార్డులు చేభూని ఆందోళన వ్యక్తం చేశారు. కూరపాటి సత్యంరాజు మాట్లాడుతూ ఖాళీ కడుపులతో ఆందోళన చేయడం మాకు ఇష్టం లేదు.. ప్రజల ప్రాణాలు కాపాడే సేవకులం మేము. మా బాధను అర్థం చేసుకోండి.. మా డిమాండ్లపై ప్రభుత్వం ఆలోచించండి అంటూ దీన స్థితిలో ప్రాదేయపడి అడుగుతూ ఆందోళన చేస్తున్న పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. చేతుల్లో తమ డిమాండ్లను ప్రతిబింబించే ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లాలన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నాం. మా సేవలను గుర్తించండి.. మా జీవితాలను కూడా ఆలోచించండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్టాఫ్‌ నర్సులు తబిత, కల్పన, అనూష, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌ అనిల్‌ కుమార్‌, ల్యాబ్‌ టెక్నీషియన్లు సునీత, నీలిమ, బహటం తదితర కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement