21లోపు దరఖాస్తు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

21లోపు దరఖాస్తు చేసుకోవాలి

Sep 18 2026 2:03 AM | Updated on Sep 18 2026 2:03 AM

నగరం: మద్యం షాపుల లైసెన్స్‌ పునరుద్ధరణకు ఈనెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ విజయ చెప్పారు. స్థానిక ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ పోలీస్‌స్టేషన్‌లో గురువారం స్టేషన్‌ పరిధిలోని నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల పరిధిలోని మద్యం దుకాణాల లైసెన్స్‌దారులతో సమావేశం నిర్వహించారు. విజయ మాట్లాడుతూ స్టేషన్‌ పరిధిలోని 12 ఓపెన్‌ కేటగిరి, ఒక గీత కులాల రిజర్వుడ్‌ కేటగిరి మద్యం దుకాణాలు ఉన్నాయన్నారు. 01–10–2026నుంచి 30–09–2027 వరకు లైసెన్స్‌ పునరుద్ధరణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. లైసెన్స్‌దారులు పాత లాగిన్‌ వివరాలతో ఎకై ్సజ్‌శాఖ పోర్టల్‌లో లాగిన్‌ అయి రెన్యువల్‌ చేసుకోవాలని సూచించారు. రెన్యూవల్‌ దరఖాస్తులు ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు చేయాలన్నారు. పునరుద్ధరణ కాని మద్యం దుకాణాలను ఎకై ్సజ్‌ పాలసీ 2024 ప్రకారం లాటరీ ద్వారా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్‌ అధికారి నరేష్‌కుమార్‌, సీఐ హర్షవర్దనరెడ్డి పాల్గొన్నారు.

ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌

అసిస్టెంట్‌ కమిషనర్‌ విజయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement