బాపట్లటౌన్: బాపట్ల ఫొటోగ్రాఫర్‌కు జాతీయస్థాయి అవార్డు వరించింది. ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా, ఏపీ సృజనాత్మక, సాంస్కృతిక కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి ఫొటో కాంఫిటేషన్ ఆగష్టు 15 సందర్భంగా విద్యార్థులు ఆడిన ఫుడ్‌బాల్ గేమ్ ఫొటో జాతీయస్థాయిలో ఎక్స్‌లెన్స్ అవార్డు ఆఫ్‌ది ఇయర్ 2026 అవార్డు అందుకున్నారన్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా పీఏఐ ఛైర్మన్ తుమ్మా శ్రీనివాసరెడ్డి, అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్ గోలి వెంకట శివకుమార్‌లు అభినందించారు.
గుంటూరు రూరల్: కారు డ్రైవర్ ఓవర్ స్పీడుకు బొలెరో డ్రైవర్ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ భాస్కర్ తెలిపిన వివరాలు.. ఎన్‌హెచ్ 16లో బుడంపాడు వద్ద ప్రకాశం జిల్లాకు చెందిన పాలకుర్తి వెంకటేశ్వర్లు బొలెరో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఈక్రమంలో శుక్రవారం విజయవాడ వైపు నుంచి బొలెరో ట్రక్‌లో బాతుల లోడుతో వెళుతూ బుడంపాడు వద్ద హైవే నుంచి కిందకు దిగుతున్నాడు. అదే క్రమంలో తెనాలి బాలాజీరావుపేటకు చెందిన జల్లి సతీష్ హైవే సమీపంలోని ఆస్పత్రిలోలో ఆరోగ్యం చూపించుకుని హైవే ఎక్కేందుకు తన కారులో వెళుతున్నాడు. కారులో వెళుతూ మితిమీరిన వేగంతో హైవే నుంచి సర్వీస్ రోడ్డులోకి దిగుతున్న బొలెరో ట్రక్‌ను ఢీకొన్నాడు. బొలెరో ట్రక్ బోల్తాపడగా డ్రైవర్ వెంకటేశ్వర్లు(45) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురికి తరలించి మృతుడి బంధువులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


