బాపట్లటౌన్: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంతవరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉంటామని ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ సభ్యులు కూరపాటి సత్యంరాజు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఏరియా వైద్యశాలలో నల్లబెలూన్‌లతో నిరసన తెలిపారు. సత్యంరాజు మాట్లాడుతూ తమను రెగ్యులరైజ్ చేయాలని, రెగ్యులరైజ్ చేసేంతవరకు 100 శాతం గ్రాస్ జీతం ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు బదిలీ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగి మరణిస్తే 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందని, మరోసారి చర్చలకు కూడా ఆహ్వానిస్తుందనే విశ్వాసం ప్రభుత్వం పైన తమకుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ అనూష, ల్యాబ్ టెక్నీషియన్లు నీలిమ, సునీత, బయో మెడికల్ ఇంజనీర్ నళిని కుమారి, ఫార్మసిస్టులు నళిని, సుధ, శాంతి మనోజ పాల్గొన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ సభ్యుడు సత్యంరాజు


