ఏకపక్ష నిర్ణయాలతో మమ్ములను నష్టాలపాలు చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

ఏకపక్ష నిర్ణయాలతో మమ్ములను నష్టాలపాలు చేయొద్దు

Sep 12 2026 1:48 AM | Updated on Sep 12 2026 1:48 AM

బాపట్లటౌన్‌: ఏకపక్ష నిర్ణయాలతో మమ్ములను నష్టాలపాలు చేయొద్దని మద్యం లైసెన్స్‌దారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న 38 శాతం రెన్యూవల్‌ ఫీజు నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం బాపట్ల నియోజకవర్గంలోని లైసెన్స్‌దారులు బాపట్ల ఎకై ్సజ్‌శాఖ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. లైసెన్స్‌దారులు మాట్లాడుతూ ఇప్పటికే నష్టాల్లో ఉన్న మాకు ఊరట కల్పించకపోగా మమ్ములను ఇబ్బందులకు గురిచేయటం సరికాదన్నారు. గత ఏడాది చెల్లించిన వార్షిక ఎకై ్సజ్‌ రుసుంపై అదనంగా 38 శాతం రెన్యువల్‌ ఫీజు చెల్లించాలనే ప్రతిపాదన తమకు తీవ్ర ఆర్థిక భారంగా మారుతుందన్నారు. బాపట్ల నియోజకవర్గంలో జనాభాకు అనుగుణంగా కాకుండా అధిక సంఖ్యలో మద్యం షాపులు ఉండటంతో గత రెండు సంవత్సరాలుగా తీవ్ర పోటీ నెలకొని తీవ్ర నష్టాలను చవిచూశామన్నారు. గత పాలసీలో 20 శాతం మార్జిన్‌ వస్తుందనే ఆశతో లాటరీ ద్వారా షాపులను దక్కించుకున్న వ్యాపారులు, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారన్నారు. లాటరీలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని కూడా తిరిగి రాబట్టలేకపోగా కనీసం లైసెనన్స్‌ ఫీజును కూడా పూర్తిగా రాబట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యాపారాన్ని కొనసాగించలేమనే స్థాయికి మేమంతా చేరుకున్నామని వారు స్పష్టం చేశారు.

ఎకై ్సజ్‌ కార్యాలయం ముందు

ఆందోళనకు దిగిన లైసెన్స్‌దారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement