కలెక్టర్ల సదస్సులో బాపట్ల కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్ల సదస్సులో బాపట్ల కలెక్టర్‌

Sep 11 2026 9:40 AM | Updated on Sep 11 2026 9:40 AM

కలెక్టర్ల సదస్సులో బాపట్ల కలెక్టర్‌

బాపట్ల: రాష్ట్ర సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో బాపట్ల జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు.

గ్యాస్‌ లీకై గృహోపకరణాలు దగ్ధం

ఈపూరు: గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించి ఇంట్లోని గృహపకరణాలు పూర్తిగా దగ్ధమైన సంఘటన మండలంలోని కొచ్చర్ల గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన గోరంట్ల అంజయ్య భార్య వెంకాయమ్మ ఇంట్లో వంట చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించడంతో భయంతో బయటకి పరుగులు తీశారు. మంటలు వేగంగా వ్యాపించి ఫ్రిడ్జ్‌, టీవీ, కూలర్‌, ఇతర వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. సుమారు రూ.60 వేలు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement