మాదకద్రవ్యాలు వద్దు.. జీవితమే ముద్దు | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాలు వద్దు.. జీవితమే ముద్దు

Sep 11 2026 9:40 AM | Updated on Sep 11 2026 9:40 AM

బాపట్ల: విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, ఆ దశలో విద్య పట్ల ఏకాగ్రతను కలిగివుండి, క్రమశిక్షణతో మెలగాలని, డ్రగ్స్‌కు లోనై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని బాపట్ల వ్యవసాయ కళాశాల ఇన్‌చార్జి అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ ఎస్‌.ఆర్‌.కోటేశ్వరరావు అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో జరిగిన నశా విముక్త భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత మాత్రమేనని, యువతకు అసాధ్యం కానిదేది లేదని, తమ ప్రతిభా పాటవాలను వారు తమ విద్యాభివృద్ధికి అంకితం చేస్తే అది వారి అభివృద్ధికి తద్వారా దేశ పురోభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ఆ క్రమంలో వారు మాదకద్రవ్యాలకు అలవాటుపడకుండా జాగ్రత్త వహించాలన్నారు. డాక్టర్‌ కె.ఎస్‌.ఆర్‌.పాల్‌ మాదకద్రవ్యాలు వద్దు, జీవితమే ముద్దు అనే నినాదాన్ని చాటి విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు డాక్టర్‌ కె.సుశీల, డాక్టర్‌ జి.విజయ్‌కుమార్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ వై.అంకమ్మ, ఏ.ఈ.ఎల్‌.పి. విద్యార్థులు పాల్గొన్నారు.

వ్యవసాయ కళాశాల ఇన్‌చార్జి అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ కోటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement