కర్లపాలెం(బాపట్ల టౌన్): పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి విజయలక్ష్మి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లపై నిలచిన వర్షపు నీటిని బయటకు పంపించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కాలువల ద్వారా నీటితో సకాలంలో చెరువులు నింపుకోవాలన్నారు. రానున్న రోజుల్లో ఎండతీవ్రత పెరిగే అవకాశం ఉందని ఏ గ్రామంలో కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా చెరువులను నింపుకోవాలని ఆదేశించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ఎన్నికల ప్రక్రియకు సంబందించిన ఓటర్ల జాబితా, పోలింగ్‌బూత్‌ల పరిశీలన పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డెప్యూటీ ఎంపీడీఓ అయినంపూడి శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మంజూర్ బాషా, ఏపీవో శ్యామ్ పాల్గొన్నారు.
డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి
విజయలక్ష్మి


