పాఠశాల కోసం రూ.80 లక్షల భూదానం | - | Sakshi
Sakshi News home page

పాఠశాల కోసం రూ.80 లక్షల భూదానం

Sep 8 2026 1:47 AM | Updated on Sep 8 2026 1:47 AM

పాఠశాల కోసం రూ.80 లక్షల భూదానం జెడ్పీకి టీటీడీ కళ్యాణ మండపం ఇవ్వటం సరికాదు స్నేహితుడి హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పథకానికి దరఖాస్తులు బాపట్ల: ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి జిల్లా, మండల స్థాయి అధికారులతో సోమవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్‌ భరోసా కొత్త పింఛన్‌ల మంజూరుకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్‌ తెలిపారు. పింఛన్‌ పొందడానికి అర్హులైన వారంతా ఈనెల ఏడు నుంచి 16వ తేదీ వరకు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డ్‌ సచివాలయాల వద్ద దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుల పరిశీలన, సాధారణ అర్హత ఎంపిక ప్రక్రియ ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు పరిశీలిస్తారని, అనంతరం జిల్లాస్థాయి అధికారులకు, ఆ తదుపరి రాష్ట్రస్థాయి అధికారులకు సిఫార్సు చేస్తూ దరఖాస్తులను పంపుతామన్నారు. కొత్త పింఛన్ల మంజూరు కోసం బడ్జెట్‌ ప్రతిపాదన ఈనెల 25 నుంచి 26వ తేదీలోగా ప్రభుత్వానికి సెర్ప్‌ నివేదిస్తుందన్నారు. పింఛన్‌ పొంద గోరే వారంతా తక్షణమే స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల వద్ద దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు.

మార్టూరు: ఉన్నత పాఠశాల నిర్మాణం కోసం మండలంలోని నాగరాజుపల్లి గ్రామానికి చెందిన దాత దాసం సత్యనారాయణ సుమారు రూ.80 లక్షల విలువైన 65 సెంట్ల సొంత భూమిని జిల్లా పరిషత్‌కు విరాళంగా అందజేశారు. గ్రామంలో దశాబ్ద కాలంగా హైస్కూలుకు సరైన స్థలం లేకపోవడంతో విద్యార్థులు ప్రాథమిక పాఠశాల భవనంలోనే సర్దుకుంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన సత్యనారాయణ ముందుకొచ్చి, పాఠశాల కోసం తన విలువైన భూమిని గత శనివారం జిల్లా పరిషత్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆ రిజిస్ట్రేషన్‌ పత్రాలను సోమవారం జిల్లా పరిషత్‌ సీఈవో బి.చిరంజీవికి అందజేశారు. విద్యార్థుల భవిష్యత్‌ కోసం స్థలాన్ని విరాళంగా అందించిన దాత సత్యనారాయణను సీఈఓ చిరంజీవి ఘనంగా సన్మానించి అభినందించారు.

బాపట్ల: బాపట్ల జిల్లా పరిషత్‌ కార్యాలయానికి టీటీడీ కళ్యాణ మండపాన్ని ఇవ్వటానికి ప్రతిపాదనలు సిద్ధం చేయటం సరికాదని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పేరంగరుడాచలం నాయుడు దాతృత్వంతో ఇచ్చిన స్థలంలో పేదలు తక్కువ ఖర్చుతో వివాహాలు చేసుకునేందుకు ఏర్పాటు చేసిన కళ్యాణమండపాన్ని జిల్లా పరిషత్‌ కార్యాలయానికి కేటాయించటం సరికాదన్నారు. దాతల స్థలాలను ఇష్టమొచ్చినట్లు కార్యాలయాలు ఏర్పాటు చేయటం వలన ఆయన కోర్కెలకు విఘాతం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారులు ఇప్పటికై న ఈవిషయంపై పునరాలోచన చేయాలని సూచించారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, బల్లిరెడ్డి ఉన్నారు.

నగరం: నగరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2021లో జరిగిన స్నేహితుడి హత్య కేసులో నిందితుడు కంచర్ల శశికుమార్‌కు గుంటూరు 4వ అదనపు జిల్లా సెషన్‌న్స్‌ కోర్టు సోమవారం జీవిత ఖైదు ,రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. మండలంలోని ఉల్లిపాలెం గ్రామానికి చెందిన మేకల ప్రేమ్‌కుమార్‌ తన స్నేహితులు చెరుకుపల్లికి చెందిన కంచర్ల శశికుమార్‌, మహమ్మద్‌ షాహూల్‌ అఫ్రిదిలతో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో నిందితులు ఇనుప రాడ్డుతో ప్రేమ్‌కుమార్‌ తల, వీపుపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకునేందుకు వచ్చిన భార్య ఎస్తేరురాణిపై కూడా దాడి చేశారు. చికిత్స పొందుతూ బాధితుడు 04.12.2021న మృతి చెందాడు. భార్య ఎస్తేరురాణి ఫిర్యాదు మేరకు నగరం పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి బాపట్ల డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు నిర్వహించారు. సాకా్‌ష్య్‌లు సేకరించి 28.02.2022న కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. విచారణలో ప్రస్తుత రేపల్లె డీఎస్పీ అజీజ్‌ పర్యవేక్షణలో పోలీసులు సాక్షులను హాజరుపరచి బలమైన ఆధారాలు సమర్పించగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ షేక్‌ మోబీనా బేగం సమర్థంగా వాదనలు వినిపించారు. దీంతో నిందితుడిపై నేరం రుజువై శిక్ష ఖరారైంది. ఈ కేసులో దర్యాప్తు, ట్రయల్‌ పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించిన పోలీస్‌ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ అభినందించారు. మరో నిందితుడు మహమ్మద్‌ షాహూల్‌ అఫ్రిది ఇప్పటికే మృతి చెందాడు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement