‘రేపల్లె’ కరువు ప్రాంతంగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

‘రేపల్లె’ కరువు ప్రాంతంగా ప్రకటించాలి

Sep 8 2026 1:47 AM | Updated on Sep 8 2026 1:47 AM

‘రేపల్లె’ కరువు ప్రాంతంగా ప్రకటించాలి

సమన్వయకర్త పీటా నాగ మోహన్‌కృష్ణ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం

బాపట్ల: రేపల్లె నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని వైఎస్సార్‌ సీపీ రేపల్లె సమన్వయకర్త పీటా నాగ మోహన్‌కృష్ణ కోరారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ను సోమవారం కలిసి వినతి పత్రం అందించారు. పీటా నాగ మోహన్‌కృష్ణ మాట్లాడుతూ వరి ప్రధాన పంటగా ఉన్న రేపల్లె ప్రాంతంలో 70 వేల ఎకరాలు సాగు భూమి ఉండగా ఇప్పటి వరకు కనీసం 20 వేల ఎకరాలలో కూడా నాట్లు పడలేదని వివరించారు. నాట్లు వేసుకున్న పైరు కూడా ఎండిపోయిందని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వాతావరణ పరిస్థితులపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతుకు నష్టపరిహారం అందించాలని కోరారు. రైతులకు ప్రత్యామ్నాం చూపిన తరువాతనే క్రాఫ్‌హాలిడే ప్రకటించాల్సి ఉండగా కొంత సేద్యం ప్రారంభమై తరువాత క్రాఫ్‌హాలీడే ఏవిధంగా నిర్ణయిస్తారో చెప్పాలని ఆయన కోరారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో మండల కన్వీనర్లు ఇంకొల్లు రామకృష్ణ, మేడికొండ అనిల్‌, దుండి వెంకటరామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి యార్లగడ్డ మదన్‌ మోహన్‌, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిలు చిత్రాల ఓబెదు, చిమటా బాలాజీ, దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి కొక్కిలిగడ్డ రవి, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి సన్నీ, రాష్ట్ర ఎస్టీ సెల్‌ అధికార ప్రతినిధి చౌటురి రమేష్‌, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ బొర్రా వెంకటసుబ్బయ్య, జిల్లా కార్యదర్శి లుక్కా బాపనయ్య ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement