కర్లపాలెం: వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ జెడ్పీటీసీ మరుప్రోలు శివారెడ్డి తల్లి నాంచారమ్మ మంగళవారం మృతిచెందారు. పార్టీ నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న పర్చూరు నియోజకవర్గం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త గాదె మధుసూధన రెడ్డి, చీరాల నియోజకవర్గం పార్టీ పరిశీలకులు మోదుగుల బసవపున్నా రెడ్డి బుధవారం దుండివారిపాలెం వచ్చి నాంచారమ్మ భౌతికకాయంపై పూలమాలలు ఉంచి నివాళుల ర్పించారు. అనంతరం శివారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాయకులు మందపాటి పరమానందకుమార్, గోవతోటి విజయ్, గొర్రుముచ్చు ఆనందరావు, డేగల రవిరెడ్డి, నర్రా నాగశ్రీను, పులుగు సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.
తెనాలిఅర్బన్: ప్రజల సొమ్మును దోచుకున్న సచివాలయ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఉయ్యాల శ్రీనివాస్‌పై మున్సిపల్ కమిషనర్ జే రామ అప్పలనాయడు సస్పెన్షన్ వేటు వేశారు. చెంచుపేట–1 సచివాలయ పరిధిలో వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీగా ఉయ్యాల శ్రీనివాస్ పనిచేస్తున్నారు. అతడు వార్డు పరిధిలోని ప్రజల నుంచి విద్యుత్ బిల్లులకు సంబంధించిన నగదు తీసుకుని సొంత అవసరాలకు వాడుకున్నాడు. అలాగే ఇంటి పేరు మార్పు చేసేందుకు కొందరు భవన యజమానుల నుంచి నగదు వసూలు చేసి మున్సిపాలిటీకి జమ చేయలేదు. ఈ విషయాన్ని సాక్షి దినపత్రిక ఈనెల 1వ తేదీన ప్రభుత్వ నిధులు స్వాహా పేరిట వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించి కమిషనర్ జే రామఅప్పలనాయుడు వెంటనే విచారణ జరపాలని అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావును ఆదేశించారు. ఆయన విచారణలో ఆరోపణలు నిర్ధారణ కావటంతో దానికి సంబంధించిన నివేదికను కమిషనర్‌కు అందజేశారు. దీంతో సదరు ఉద్యోగిని సస్పెండ్ చేస్తు బుధవారం సాయంత్రం కమిషనర్ ఆదేశాలు జారీచేశారు.
మంగళగిరి రూరల్: అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్లను ఆరు నెలల్లో చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం హర్షణీయమని అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆత్మకూరు పరిధిలోని డీజీపీ కార్యాలయంలో సీఐడీ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ నోడల్ అధికారి ఈశ్వర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వ హయాంలో రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు రూ.906 కోట్లు ఇప్పించామని తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి బాధితులకు పూర్తి న్యాయం చేయాలని వినతిపత్రంలో కోరారు. బాధితులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేక క్లెయిమ్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో కనీసం 8, ఒడిశాలో 2 కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. కర్ణాటక అధ్యక్షుడు గురుమూర్తి, ఒడిశా అధ్యక్షుడు ఐదు చంద్రారావు తదితరులు పాల్గొని క్లెయిమ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
మంగళగిరి రూరల్: వైద్య విద్యార్థులు కల్చరల్ మీట్ కార్యక్రమాల్లో పాల్గొనటంవల్లన వారు మానసిక ఒత్తిడి నుండి బయటపడతారని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు సత్యకుమార్ యాదవ్ అన్నారు. మండలంలోని చినకాకాని గ్రామ పరిధిలో ఎన్నారై మెడికల్ కాలేజీ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో రెండు రోజులపాటు నిర్వహించనున్న కల్చరల్ మీట్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వీసీ డాక్టర్ పులారి చంద్రశేఖర్‌లు బుధవారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని మెడికల్, డెంటల్ కళాశాల విద్యార్థులు పాల్గొంటున్న ఈ కార్యక్రమం వలన వైద్య విద్యార్థుల్లో భావవ్యక్తీకరణ, బృందస్ఫూర్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు. అనంతరం ఎన్నారై యాజమాన్యం ప్రవేశపెట్టినహెల్త్ చెకప్ కార్డులను మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఎన్నారై అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సెక్రటరీ సోము కృష్ణమూర్తి ట్రెజరర్ కె.బాపిరెడ్డి, జాయింట్ సెక్రెటరీ డాక్టర్ మనీ అక్కినేని, ఫౌండర్ డైరెక్టర్లు అప్పారావు ముక్కమాల, ఉపేంద్రనాథ్ నిమ్మగడ్డ, పోలవరపు రాఘవరావు, డాక్టర్ బుచ్చయ్య అ చౌదరి, డీన్ లక్ష్మీ, మెడికల్ సూపరింటెండెంట్ జి.శ్రీనివాసరావు. వైద్య సిబ్బంది మరియు వైద్య, దంత విద్యార్థులు పాల్గొన్నారు. ట


