చీరాల: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈనెల 7న సీఎం చంద్రబాబు నాయుడు చీరాల వస్తున్నారని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మంగళవారం సాయంత్రం సీఎం పర్యటించే ప్రాంతాలను, సభా వేదిక, హెలిప్యాడ్‌లను కలెక్టర్ వి.వినోద్‌కుమార్, ఎస్పీ బి.ఉమామహేశ్వర్, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యలతో కలిసి పరిశీలించారు. నేతన్న సేవా పథకం ద్వారా చేనేతలకు నగదు పంపిణీ కార్యక్రమం చీరాలలో జరగనుందన్నారు. సభా వేదిక, హెలిప్యాడ్, చేనేతలతో మాట్లాడే ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనలో ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి మార్గనిర్దేశం చేశారు. అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ కమిషనర్ రేఖారాణి, బుడా చైర్మన్ సీహెచ్ రాజశేఖరబాబు, చీరాల, బాపట్ల, రేపల్లె ఆర్డీఓలు నరసింహారావు, ఏ.హరికుమార్, బి.శ్రీదేవి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


