న్యాయవాదుల క్రికెట్‌ టోర్నీ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల క్రికెట్‌ టోర్నీ ప్రారంభం

Aug 5 2026 2:35 AM | Updated on Aug 5 2026 2:35 AM

న్యాయవాదుల క్రికెట్‌ టోర్నీ ప్రారంభం

గుంటూరు లీగల్‌: గుంటూరు బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదుల క్రికెట్‌ టోర్నమెంట్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్‌ చక్రవర్తి మంగళవారం ప్రారంభించారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న పోటీలో తొలుత జిల్లా ప్రధాన న్యాయమూర్తి బ్యాటింగ్‌ చేయగా బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ ఒట్టిజొన్నల బ్రహ్మారెడ్డి బౌలింగ్‌ చేసి లాంఛనంగా పోటీలను ప్రారంభించారు. మొదటి మ్యాచ్‌లో ఈగల్‌ టీం తమ ప్రత్యర్థి ఇండియా లీగల్‌–11 జట్టుపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సచిన్‌ స్పార్క్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. రెండవ మ్యాచ్‌లో 11 బుల్లెట్స్‌ జట్టు తమ ప్రత్యర్థి ప్రేమ్‌ చంద్‌ టీంపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్న కె.ఆనంద్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు జి.శాంతకుమార్‌, వి.బ్రహ్మారెడ్డి, గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.

అండర్‌–18, 20 అథ్లెటిక్స్‌ జట్ల ఎంపిక

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): తిరుపతిలో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ అథ్లెటిక్‌ పోటీల్లో పాల్గొనే అండర్‌–18, 20 గుంటూరు జిల్లా అథ్లెటిక్‌ జట్లు ఎంపిక చేసినట్లు జిల్లా అథ్లెటిక్‌ సంఘం కార్యదర్శి జీవీఎస్‌ ప్రసాద్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు తమ ఒరిజినల్‌ వయసు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్‌ కార్డు తీసుకొని ఈనెల 5వ తేదీ ఉదయం 10 గంటలకు, జిల్లా అథ్లెటిక్‌ సంఘం కార్యదర్శి జీవీఎస్‌ ప్రసాద్‌ను బీఆర్‌ స్టేడియంలో సంప్రదించాలని కోరారు.

ఎంపికై న క్రీడాకారుల వివరాలు

అండర్‌–18 బాలురు: బి వంశీ, జి సూర్యతేజ, జి నవీన్‌రెడ్డి, ఎస్‌ శ్రీనివాస్‌, కే.చంద్రశేఖర్‌, షేక్‌ అస్లాం, జె.హరి వెంకటయ్య, అంజిబాబు, ఎన్‌ ఫణీంద్ర, జి.నాగరాజు, జి.మణికంఠ, జి వరుణ్‌ కుమార్‌.

అండర్‌–18 బాలికలు: ఏ.భూమిక నీలం, పి.జాహ్నవి, సీహెచ్‌.కరుణ, వై.పావని, ఎస్‌కె పర్వీన్‌, నజియాబాను, శ్రీ లక్ష్మీ అనూష, ఎండీ ఆసియా, కె.రితిక.

అండర్‌–20 బాలురు– షేక్‌ నూర్‌బాషా, షేక్‌ అబ్దుల్లా, అమీద్‌, ఆర్‌ కె యశ్వంత్‌, ఎస్‌కె ఆల్మోస్‌, వై యశ్వంత్‌కుమార్‌, వి.ప్రేమ్‌ సాయి, జి భూపతి, యు శ్రీకాంత్‌, ఎం.మణిదీప్‌.

అండర్‌– 20 బాలికలు: పి ఇందుమతి పి.హేమవర్ష, రూపనేత పాత్ర, ఎస్‌కే మహారాజ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement