బాపట్ల: ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఆన్‌లైన్‌లోనూ ఈఎఫ్‌లు పూర్తి చేయొచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని 29 వ వార్డు, బెస్తపాలెం 69వ పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్‌ఓలు నిర్వహిస్తున్న సర్ ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లతో ఫోన్ ద్వారా మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని బీఎల్‌ఓలను ఆదేశించారు. కలెక్టర్ నేరుగా ఓటర్లతో మాట్లాడారు. గడువు ముగుస్తున్నందన ప్రక్రియ వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. బాపట్ల ఆర్డీఓ ఎ. హరికుమార్, మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, డీఆర్‌డీఏ పీడీ బి.సింగయ్య, మున్సిపల్ కమిషనర్ ఎం.హాసిని తదితరులు పాల్గొన్నారు.
నేడు జిల్లా కలెక్టరేట్‌లో పీజీఆర్
బాపట్ల: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఉదయం తొమ్మిది నుంచి 10 గంటల వరకు గతంలో పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీల పరిష్కారంపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి సమస్యల అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలన్నారు. తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకుంటే సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కలెక్టర్ తెలిపారు.


