ఐఏపీ ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌గా డాక్టర్‌ ఉమాజ్యోతి | - | Sakshi
Sakshi News home page

ఐఏపీ ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌గా డాక్టర్‌ ఉమాజ్యోతి

Jul 13 2026 1:04 AM | Updated on Jul 13 2026 1:04 AM

ఐఏపీ ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌గా డాక్టర్‌ ఉమాజ్యోతి డాక్టర్‌ వీవీ రామ్‌కుమార్‌కు జాతీయ పురస్కారం పూర్వ వేద విద్యార్థుల ఆత్మీయ సమావేశం తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆశ్రమంలో పూర్వ వేద విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం వైభవంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులందరూ భక్తిశ్రద్ధలతో పరమహంస పరివ్రాజకులు త్రిదండి చిన్న జీయర్‌స్వామి వారికి పాదపూజ నిర్వహించారు. అనంతరం స్వామివారి చేతుల మీదుగా శ్రీపాద తీర్థాన్ని అందజేశారు. క్రేన్‌ వక్క పలుకుల అధినేత గ్రంధి కాంతారావు ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారితో తమకున్న అనుబంధాన్ని వివరించారు. ప్రతి సంవత్సరం వేద విద్యార్థుల సంఖ్య పెరగాలని, దేశానికి వేదం ఎంతో ఆవశ్యకమని, వేదం ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈతరం బాలలే పునాదులని, దానికి మనమందరం కృషి చేయాలని పేర్కొన్నారు. గుంటూరు ఎస్పీని కలసిన అమరావతి ఎల్‌అండ్‌ఓ ఓఎస్డీ

గుంటూరు మెడికల్‌: ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ(ఐఏపీ) ఏపీ స్టేట్‌ బ్రాంచ్‌ ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌గా గుంటూరు జీజీహెచ్‌ మానసిక వ్యాధుల వైద్య విభాగాధిపతి డాక్టర్‌ నీలి ఉమాజ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం విశాఖపట్నంలో మానసికవ్యాధి వైద్య నిపుణుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్‌ ఉమాజ్యోతిని మానసిక వైద్య నిపుణుల సంఘం రాష్ట్ర శాఖకు ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌గా ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఈమె రాష్ట్ర శాఖలో వైస్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. డాక్టర్‌ ఉమాజ్యోతి 1999 నుంచి సంఘంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. గుంటూరు జిల్లా అధ్యక్షురాలిగా, రాష్ట్ర సంఘంలో పలు హోదాల్లో సేవలందించారు. ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై న డాక్టర్‌ ఉమాజ్యోతికి మానసికవ్యాధి వైద్య నిపుణుల సంఘం గుంటూరు ప్రెసిడెంట్‌ డాక్టర్‌ వడ్డాది వెంకటకిరణ్‌, సెక్రటరీ డాక్టర్‌ పసుపుల సాయి కిరణ్‌, ఇతర సంఘ నేతలు, గుంటూరు జీజీహెచ్‌ మానసికవ్యాధుల వైద్య విభాగానికి చెందిన వైద్యులు, జీజీహెచ్‌, గంటూరు వైద్య కళాశాల అధికారులు, వైద్యులు అభినందనలు తెలిపారు.

గుంటూరు మెడికల్‌: గుంటూరుకు చెందిన ప్రముఖ మధుమేహవైద్యనిపుణులు, ఎస్వీఆర్‌ షుగర్‌ హాస్పిటల్‌ నిర్వాహకులు డాక్టర్‌ వీవీ రామకుమార్‌ ఆదివారం జాతీయస్థాయి అవార్డు అందుకున్నారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో జ్యోతి దేవ్‌ ప్రొఫెషనల్‌ ఎడ్యుకేషన్‌ ఫోరం– 2026 సంవత్సరానికి ‘పేషెంట్‌ ఎంపవర్మెంట్‌ డిజిటల్‌ ఎంగేజ్మెంట్‌ అండ్‌ పేషెంట్‌ ఎడ్యుకేషన్‌ ఇన్షియేటివ్స్‌‘ విభాగంలో ప్రముఖ మధుమేహ నిపుణులు పద్మశ్రీ డాక్టర్‌ శశాంక్‌ జోషి, త్రివేండ్రం గోకులం హాస్పిటల్‌ చైర్మన్‌ మనోజ్‌ చేతుల మీదుగా డాక్టర్‌ రామ్‌కుమార్‌ జాతీయస్థాయి పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రామ్‌ కుమార్‌ మాట్లాడుతూ మూడు దశాబ్దాలకు పైగా షుగర్‌ వ్యాధిపై వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. జాతీయ పురస్కారాన్ని అందుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. తన ఆత్మీయ పేషెంట్లకు, సహచర వైద్య బృందానికి, విద్య నేర్పిన గురువులకు, కుటుంబ సభ్యులకు డాక్టర్‌ రామ్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.

నగరంపాలెం: గుంటూరు నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ను ఆదివారం అమరావతి లా అండ్‌ ఆర్డర్‌ (ఎల్‌/ఓ) నూతన ఓఎస్డీ మనోజ్‌ రామనాథ్‌హెగ్డే మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. 2022 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మనోజ్‌ రామనాథ్‌హెగ్డే రాజంపేట నుంచి బదిలీపై అమరావతి ఎల్‌ అండ్‌ ఓకు బదిలీయ్యారు. అమరావతి రాజధాని ఏరియాకు ప్రాధాన్యత ఉందని జిల్లా ఎస్పీ అన్నారు. సున్నితమైన ప్రాంతంలో విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. తుళ్లూరు, సీఆర్డీఏ లో లా అండ్‌ ఆర్డర్‌ నిర్వహణలో ఇంటెలిజెన్స్‌, ఎస్‌బీ సమాచారంతో ఉండాలని, ప్రజా భద్రతకై విధులు చేపట్టాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement