కాంట్రాక్టర్లకు గుబిల్లు | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్లకు గుబిల్లు

Mar 12 2026 7:32 AM | Updated on Mar 12 2026 7:32 AM

కాంట్రాక్టర్లకు గుబిల్లు చీరాల: చీరాల మున్సిపాలిటీలోని వార్డుల్లో నిర్వహించే పలు అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లకు ప్రస్తుతం బిల్లుల గుబులు పట్టుకుంది. పనులైతే చేస్తున్నాం కానీ.. వాటికి సంబంధించిన బిల్లులు సకాలంలో మంజూరు కావడం లేదని ఒకింత అసంతృప్తి చెందుతున్నారు. దీంతో అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లు నిర్వహించినా పూర్తిస్థాయిలో పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా బిల్లుల మంజూరులో జాప్యం ఏర్పడుతోందని పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. టెండర్లంటే హడల్‌.. వార్డుల్లో చేపట్టే పలు అభివృద్ధి పనులకు టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు హడలెత్తుతున్నారు. చేపట్టిన పనులకు తాలూకు బిల్లులు రాకపోవడంతో వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. వివిధ పనుల నిమిత్తం 25 మంది కాంట్రాక్టర్లు పనులు చేస్తుంటారు. రోడ్లు, మురుగునీటి కాలువ పనులు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. గ్రాంట్లు వస్తున్నాయి... అజెండాలో అభివృద్ధి పనులు పెడుతున్నారు.. కౌన్సిల్‌లో ఆమోదిస్తున్నారు... కానీ చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు నిరాశ చెందుతున్నారు. ఒక్కోసారి టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల 81 పనులకు పిలవగా 39 పనులకు మాత్రమే టెండర్లు వేశారు. చీరాల మున్సిపాలిటీలో చేసిన పనులకు తాలూకు సుమారు రూ.4 కోట్ల మేర బిల్లులు రావాల్సి ఉంది. చేసిన పనుల తాలూకు బిల్లులు రాక కొత్త టెండర్లకు అప్పులు చేయాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అజెండాలో ఆమోదించిన పనులు ప్రారంభించడం లేదంటూ వార్డు కౌన్సిలర్లు సమావేశాల్లో ఏకరువు పెడుతున్నారు. గత సంవత్సరం బిల్లులన్నీ సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారానే చెల్లించాలనే నిబంధన ఉండటంతో బిల్లులు ఆలస్యం అవుతున్నాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అధికారులు బిల్లులు సకాలంలో పెట్టకపోవడం వలన కూడా ఆలస్యమవుతోంది. వార్డులపై శీతకన్ను... చీరాల మున్సిపాలిటీలో కౌన్సిల్‌ పదవీ కాలం ఎనిమిది నెలలు ఉండగానే చైర్మన్‌ మార్పు జరిగింది. వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సంఖ్యా బలం ఉందనే ధీమాతో కూటమి నేతలు చైర్మన్‌ మార్పు దిశగా పావులు కదిపి వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీకి మద్దతు పలికిన వ్యక్తిని నూతన చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి వార్డుల్లో పనులు సజావుగా జరగడం లేదని పలువురు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. చైర్మన్‌ మార్పు తర్వాత చీరాల మున్సిపాలిటీలో అనూహ్యమార్పులు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లో అభివృద్ధి పనులు చేయడం లేదని కౌన్సిలర్లు సమావేశాల్లో ఏకరవు పెడుతున్నారు. ఆమోదించిన పనులు కూడా ప్రారంభించలేదని చైర్మన్‌ దృష్టికి తెచ్చినా పట్టించుకున్న దాఖలాలు లేవు. మద్దతు పలికిన కౌన్సిలర్ల వార్డుల్లో కూడా పనులు జరగడం లేదని ఆరోపణలు చేయడం గమనార్హం. వార్డుల్లో ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు కూడా చేయించుకోలేకపోతున్నామని ్ల మదనపడుతున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా సక్రమంగా వినియోగించలేదనే వాపోతున్నారు. ఒడిశా నుంచి గుంటూరుకు గంజాయి

ఫస్ట్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ..

చీరాల మునిసిపాలిటీలో మొత్తం 33 వార్డులున్నాయి. 13.64 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ఉంది. మొత్తం జనాభా లక్షా పదివేల మంది ఉన్నారు. ఫస్ట్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా చీరాల ఉంది. చీరాల మునిసిపాలిటీకి ఏటా పన్నులు, ఇతరత్రా ఆదాయం మొత్తం రూ.11.70 కోట్లు సమకూరుతుంది. ఇవి కాకుండా 15వ ఆర్థిక సంఘం, ఇతర స్పెషల్‌ గ్రాంటుల ద్వారా సుమారు రూ.2 కోట్ల మేర మున్సిపాలిటీకి వస్తుంటాయి.

బిల్లుల మంజూరులో జాప్యం

చీరాల మున్సిపాలిటీలోని వార్డుల్లో కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు పంపించాం. ప్రస్తుతం సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారానే బిల్లులు చేయాలని నిబంధన ఉండడంతో మంజూరుకు పంపించాం. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు కూడా టెండర్లు వేయడానికి ముందుకు రావడంలేదు. త్వరలోనే బిల్లులు చెల్లిస్తాం.

చీరాల మున్సిపాలిటీలో

పేరుకుపోయిన బిల్లులు

పనులు చేసినా అందని బిల్లులు

17తో ముగియనున్న

కౌన్సిల్‌ పదవీకాలం

కాంట్రాక్టర్లలో నెలకొన్న అసంతృప్తి

సుమారు రూ.4 కోట్ల మేర

బిల్లులు నిలిచిన వైనం

నేడు వాడవాడలా వైఎస్సార్‌సీపీ

ఆవిర్భావ దినోత్సవం

విలేకరుల సమావేశంలో

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి

జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌

– రఘురాం, మున్సిపల్‌ డీఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement