వేటపాలెం: అనారోగ్యంతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్‌కు పోలీస్ లాంఛనాలతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. వేటపాలేనికి చెందిన జి. వీరరాజు ఇంకొల్లులో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ శస్త్ర చికిత్స చేయించుకొన్నారు. ఈ నెల 9వ తేదీన గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చీరాలలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్, ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య, ఎస్సై జి.సురేష్, వేటపాలెం ఎస్సై జీపీ జనార్దన్ సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియాజేశారు. కానిస్టేబుల్ కుటుంబానికి ఎస్పీ బి. ఉమామహేశ్వర్ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. అనంతరం మృతదేహానికి పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వేటపాలేనికి చెందిన వీరరాజు 1991లో ఏఆర్ కానిస్టేబుల్‌గా శాఖలో ప్రవేశించారు.


