ఉరకలెత్తిన ఉత్సాహం
సందడిగా వివా– వీవీఐటీయూ యువజనోత్సవం
పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో జాతీయస్థాయి యువజనోత్సవం (వీవా–వీవీఐటీయూ 2025–26) వేడుకలు ఘనంగా ముగిశాయి. రెండు రోజుల యువజనోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సాంకేతిక, సాంస్కృతిక, క్రీడలు యువతను ఆకట్టుకున్నాయి.
● ముఖ్య అతిథిగా పాల్గొన్న విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య మాట్లాడుతూ యువజన ఉత్సవాల నిర్వహణ వెనుక గొప్ప ఉద్దేశం ఉంటుందని, నాయకత్వ లక్షణాలు, జీవన నైపుణ్యాల పెంపునకు దోహదపడతాయని తెలిపారు.
● వీవీఐటీ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ రెండు రోజుల యువజనోత్సవంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారని, మంచి అనుభూతులతో సంతోషంగా గడిపారని తెలిపారు.
● వీవీఐటీయూ ప్రో–చాన్స్‌లర్ వాసిరెడ్డి మహదేవ్ మాట్లాడుతూ విద్యార్థులు విజయవంతంగా యువజనోత్సవాన్ని నిర్వహించారని, వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుదలకు ఈ కార్యక్రమం దోహదపడిందని తెలిపారు.
● ముఖ్య అతిథి విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య, వీవీఐటీయూ చాన్స్‌లర్ వాసిరెడ్డి విద్యాసాగర్ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
● ఈ వేడుకలో చాంపియన్ చిత్ర బృందం హీరో రోషన్, హీరోయిన్ అనస్వరా రాజన్ బృందం, వానర చిత్ర బృందం హీరో అవినాష్ తిరువీధుల, హీరోయిన్ సిమ్రాన్ చౌదరి సందడి చేశారు. కార్యక్రంలో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు, రిజిస్ట్రార్ వై. మల్లికార్జునరెడ్డి, డీన్ ఆఫ్ అకడమిక్ కె.గిరిబాబు, ఆధ్యాపకులు పాల్గొన్నారు.


