జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన పీడీ
భట్టిప్రోలు: ఐలవరం జిల్లా పరిషత్ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ తుమ్మా శ్రీనివాసరెడ్డి 60 విభాగంలో పోల్ వాల్ట్ , లాంగ్ జంప్‌లలో గోల్డ్, ట్రిపుల్ జంప్‌లో సిల్వర్ మెడల్ సాధించారు. ఈ నెల 13, 14 తేదీలలో బాపట్ల ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో శ్రీనివాసరెడ్డి సత్తా చాటారు. 2026 జనవరి 29 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు పంజాబ్ రాష్ట్రం అజ్మీర్‌లో ఆయన జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఆయనను ఎంఈవోలు పులి లాజర్, నీలం దేవరాజు, హైస్కూల్ హెచ్‌ఎం మాచర్ల మోహన్‌రావు, సర్పంచ్ మాచర్ల కోటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు మురుగుడు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అభినందించారు.


