కరాటేలో వేటపాలెం విద్యార్థుల ప్రతిభ
వేటపాలెం: మండల కేంద్రంలోని వేటపాలెం విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబర్చి టైటిల్స్ సాధించినట్లు కరాటే మాస్టర్ వి.బ్రహ్మనాయుడు ఆదివారం తెలిపారు. చిలకలూరిపేటలో 2025 నేషనల్ చాంపియన్‌షిప్ న్యూషావోలిన్, కుంపు టు అకాడమీ షావోలిన్, కుంపుటు అకాడమీ ఆధ్వర్యంలో కరాటే పోటీలు జరిగాయి. పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కటాస్ విభాగంలో హారిక, హాసిన, మృణాళిని, శాతసాహస్ర పార్నిత, బాలుర విభాగంలో అస్లాం బంగారు పతకం, చరణ్ వెండి పతకం, వేదసూర్యానంద్ వెండి పతకం సాధించారు. విద్యార్థులను తల్లిదండ్రులు, లిటిల్ స్కాలర్ స్కూల్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు అభినందించారు.


