అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక రేపు
చినగంజాం: ఉమ్మడి ప్రకాశం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 16వ తేదీ మంగళవారం ఖేలో ఇండియా అస్మిత జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నాగులుప్పలపాడు మండలం కనపర్తి గ్రామంలో నిర్వహించనున్నారు. ఈమేరకు ప్రెసిడెంట్ పి.రామచంద్రరావు, సెక్రటరీ ఎం. వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం కడవకుదురు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అండర్ 14,16 బాలికలకు ఎంపికలు ఉంటాయన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్‌కి ఎంపిక చేస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో విజయం సాధించిన మొదటి మూడు స్థానాల వారికి మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అథ్లెట్స్ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు తీసుకొని 16వ తేదీ ఉదయం 8 గంటల లోపు హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 9885788827, 7675026220 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో కోచ్ రాజు నాయక్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.


