వర్సిటీ అంతర్ కళాశాలల ఆటల పోటీలు ప్రారంభం
ఖాజీపాలెం(కర్లపాలెం): క్రీడలు దేహదారుఢ్యంతో పాటు మనోధైర్యాన్ని కలిగిస్తాయని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు చెప్పారు. నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల 48వ అథ్లెటిక్స్ పోటీలను ఖాజీపాలెం కేవీఆర్ కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాలలో గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు ఉంటాయని తెలిపారు. పోటీలను సక్రమంగా నిర్వహించాలని అధ్యాపకులకు చెప్పారు. బాలికల 100మీటర్ల రన్నింగ్‌లో మొదటి స్థానంలో నాగ నవీన (ఏసీ కళాశాల గుంటూరు), ద్వితీయ స్థానంలో కావ్యారెడ్డి (టీజేపీసీ గుంటూరు), తృతీయ స్థానంలో తేజశ్రీ (కేవీఆర్ కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాల ఖాజీపాలెం) బాలికల 1500 మీటర్ల రన్నింగ్ పోటీలలో మొదటి స్థానంలో లీలా ప్రవల్లిక (కేవీఆర్, కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాల ఖాజీపాలెం), ద్వితీయ స్థానంలో ధనలక్ష్మి (యూనివర్సిటీ కళాశాల నంబూరు), హేమలత (కేవీడీసీ నరసరావుపేట) ఐదు కిలోమీటర్ల రన్నింగ్‌లో బాలురు మొదటి స్థానంలో ప్రజ్ఞా మనోహర్ ( కేవీఆర్, కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాల ఖాజీపాలెం), ద్వితీయ స్థానంలో వాగ్దేవి డిగ్రీ కాలేజీ నరసరావుపేట, తృతీయ స్థానంలో రుస్తుమ్ అలీ (కేవీఆర్, కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాల ఖాజీపాలెం) విజేతగా నిలిచారు. చరు. వీరికి ఎమ్మెల్యే నరేంద్రవర్మ రాజు, కళాశాల ప్రిన్సిపాల్ శివప్రసాద్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పీడీ రామకృష్ణారెడ్డి, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు పాల్గొన్నారు.


