
జాతీయస్థాయి పోటీలకు బాపట్ల స్విమ్మర్ల ఎంపిక
బాపట్లటౌన్: జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలకు బాపట్ల ప్రాంతానికి చెందిన ఇద్దరు స్విమ్మర్లు ఎంపికయ్యారు. ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు గుజరాత్‌లోని నారన్పూర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 78వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ చాంపియన్ షిప్–2025 (స్విమ్మింగ్)పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు ఏపీ రాష్ట్రం తరపున ఎంపికై న ఇద్దరు బాపట్ల నియోజకవర్గానికి చెందిన వారే కావడం విశేషం. వీరిలో బాపట్ల పట్టణానికి చెందిన ఉప్పాల డోనాల్డ్ వెంకట్ గౌడ్ కాగా, మరొకరు పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామానికి చెందిన షేక్ ఖాజా మోహిద్దిన్‌లు ఎంపికయ్యారు. వీరి ఇరువురు గతంలో అనేకమార్లు జాతీయస్థాయి ఈత పోటీల్లో పాల్గొని పలు అవార్డులు అందుకున్నారు.
రాష్ట్రం నుంచి ఎంపికై న ఇద్దరూ బాపట్ల వాసులే 13నుంచి గుజరాత్‌లో జరగనున్న జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలు