బాపట్ల టౌన్: విధి నిర్వహణలో అలసత్త్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సిబ్బంది కవాతు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ నిర్వహించే విధుల్లో ప్రిజనర్ ఎస్కార్ట్ కీలకమైనవన్నారు. వాటిని నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించినా, ప్రలోభాలకు లోనైనా ఉపేక్షించబోమన్నారు. ఏమైనా సమస్యలను తమ దృష్టికి తీసుకొని వస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ విజయసారథి, ఎస్‌బి సీఐ నారాయణ, అడ్మిన్ ఆర్‌ఐ మౌలుద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు.